కర్నూల్

నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, ఆగస్టు 14:జిల్లాలో నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఆ శాఖ ఎస్‌ఈ సురేష్‌కుమార్ తెలిపారు. అలాగే వ్యవసాయ బోర్ల కోసం 5 హెచ్‌పీ వినియోగించుకునే ప్రతి రైతుకు ఉచితంగా ట్రాన్స్‌ఫార్మర్ ఇస్తామని తెలిపారు. ఎస్‌ఈ మంగళవారం డోన్ రహదారిలో ఉన్న విద్యుత్ ఉపకేంద్రాన్ని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది పని తీరుకు సంబంధించిన రిజిస్టర్లను, మండలంలో విద్యుత్ సరఫరా బ్రేకర్లను, లోడ్లను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రైతుల కోసం ప్రత్యేకమైన చర్యలు చేపడుతామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో రూ. 6,070 కోట్లను కేవలం వ్యవసాయ బోర్ల విద్యుత్ సరఫరా కోసమే కేటాయించామన్నారు. 5 హెచ్‌పీ మోటార్లను వినియోగించే ప్రతి రైతుకి ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఇస్తామన్నారు. అదనపు హెచ్‌పీలు వినియోగిస్తే అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అనంతరం బనగానపల్లె రహదారిలోని విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించి విధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వైసీపీ అధికారంలోకి వస్తే ఏటా 5లక్షల గృహాల నిర్మాణం
* ఎమ్మెల్యే బుగ్గన
బేతంచెర్ల, ఆగస్టు 14:రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే ఏటా 5లక్షల గృహాలు నిర్మించి, పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని అంబాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బుగ్గన హాజరయ్యేందుకు వెళ్లగా తొలుత నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో వీధి వీధినా తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన తాగునీటి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో 80శాతం నిధులు ఆ పార్టీ నాయకుల జేబులోకి చేరాయని, 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వందశాతం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తే అందరి సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. అలాగే డ్వాక్రా మహిళల రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తామన్నారు. 45 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛను ఇస్తామన్నారు. ప్రతి పేద కుటుంబం కోసం సంక్షేమ పథకాలను రూపకల్పన చేస్తామన్నారు.