కర్నూల్

రాయలసీమ రేంజ్‌లో 43 మంది ఎస్‌ఐలకు పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 14:రాయలసీమ రేంజ్‌లోని 43 మంది ఎస్‌ఐలకు సీఐలుగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో 2005 బ్యాచ్‌కు చెందిన వారు ఐదుగురు, 2008కి చెందిన వారు 32 మంది, 2010కి చెందిన వారు ఆరుగురు ఉన్నారు. వారి వివరాలు.. చిత్తూరు జిల్లాకు చెందిన సురేష్‌కుమార్, అశోక్‌కుమార్, ఈశ్వర్, విశ్వనాథ్‌రెడ్డి, కళా వెంకటరమణ, నరేష్‌బాబు, వెంకటరమణ, గురునాథ్, వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్, కడప జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డి, వెంకటచలపతి, రెడ్డి శేఖర్‌రెడ్డి, నాగరాజు, ఈశ్వరయ్య, అనంతపురం జిల్లాకు చెందిన మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులు(పీటీసీ), హమీద్‌ఖాన్, వెంకటేశ్వర్లు, వెంకట నరసింహారావు(ఇంటెలిజెన్సీ), రామారావు, ఏపీ ట్రాన్స్‌కో నుంచి అతిథినాయుడు, శ్రీనివాసులు, జయనాయక్, కృష్ణయ్య(పీటీసీ), రవిశంకర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో నుంచి ధరణీకిషోర్, శ్రీనివాసులు, శేఖర్, వెంకటేష్‌నాయక్, కర్నూలు జిల్లాకు చెందిన మోహన్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, వెంకటరమణ, మంజునాథ్‌రెడ్డి, కె.మోహన్‌రెడ్డి, సీఐడీ నుంచి యుగంధర్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ నుంచి మహ్మద్‌జావీద్, శ్రీహరి, రమేష్ బాబు, సుబ్రహ్మణ్యం, చంద్రబాబునాయుడు ఎస్‌ఐ నుంచి సీఐగా పదోన్నతి పొందారు. వీరికి త్వరలో పోస్టింగ్ కేటాయిస్తారని డీఐజీ తెలిపారు.