కర్నూల్

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 21:నగరంలో శుక్రవారం గణేశ్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో వైభవంగా జరిగిందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. గణేశ్ నిమజ్జనానికి నగరంలోని వినాయక్ ఘాట్ వద్ద ఏర్పాట్లు చేయగా వినాయక ఉత్సవ సమితుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గణనాథులను నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవంలో ఎంపీ బుట్టా రేణుక, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శ్రీ గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు పాల్గొన్నారు. నిమజ్జనోత్సవంలో భాగంగా ప్రప్రథమంగా రాంబోట్ల దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన గణనాథుడిని వినాయక్ ఘాట్ వద్ద కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. దీంతో రాంబోట్ల దేవాలయం వద్ద ఉదయం 10 గంటలకు ఎంపీలు రేణుక, టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ, ఎస్పీ జెట్టీ, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులతో కలిసి గణేశ్ నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు వినాయక్ ఘాట్ వద్ద కేసీ కెనాల్‌లో ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాన్ని 4 భాగాలు చేశారు. మొదటి ఊరేగింపు రాంబోట్ల దేవాలయం దగ్గర ఏర్పాటు చేసిన గణనాథుడితో ప్రారంభం కాగా రెండవ ఊరేగింపు మధ్యాహ్నం 12 గంటలకు బళ్లారి చౌరస్తాలోని హనుమాన్ జంక్షన్ నుంచి ప్రారంభమైంది. ఇక మూడవ ఊరేగింపు మధ్యాహ్నం 2 గంటలకు కల్లూరు చౌరస్తా ప్రాంతం నుంచి 4వ ఊరేగింపు నంద్యాల చెక్‌పోస్టు నుంచి ప్రారంభమైంది. ఈ నిమజ్జనోత్సవంలో దాదాపు 2 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మొదటిసారిగా దాదాపు 500 మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసి నిమజ్జనం చేయడం విశేషం. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కేఈ మాట్లాడుతూ ఈ ఏడాది నగరంలో వినాయక నిమజ్జనం, మొ హర్రం పండుగలు ఒకే రోజు వచ్చినా ప్రజలు కుల మతాలకు అతీతంగా ఐకమత్యంగా, సమన్వయం పాటించి ప్రశాంతంగా నిర్వహించుకున్నారని అభినందించారు. కర్నూలు నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. నగరంలో ఈ ఏడాది మొదటిసారిగా మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేశారని, వచ్చే ఏడాది మరిన్ని పెరిగే అవకాశం ఉందన్నారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాక్షించారు.