కర్నూల్

జగన్ పాదయాత్ర చారిత్రాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, సెప్టెంబర్ 21:వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తు న్న ప్రజా సంకల్ప పాదయాత్ర చారిత్రాత్మకం అని, ఇప్పటి వరకూ ఏ నాయకుడు 3 వేల కి.మీ పాదయాత్ర చేయలేదని మాజీ ఎమ్మెల్సీ, శ్రీశైలం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం శిల్పా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ పార్టీ నాయకుడు జగ న్ చేసినట్లు 3 వేల కి.మీ పాదయాత్ర చేయలేదని, అది ఒక జగన్‌కే సాధ్యమైందన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యలను దగ్గ ర నుంచి తెలుసుకుంటున్నాడని, రాబో యే రోజుల్లో జగన్ సీఎం కావడం ఖాయమన్నారు. జగన్ సీఎం అయితే పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. ఈ నెల 24వ తేదీకి జగన్ యాత్ర 3వేల కి.మీ కు చేరుకుంటుందని, అందుకు ఆయనకు బాసటగా నిలుస్తూ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో 25,26,27 తేదీల్లో పాదయాత్రలు, బైక్, ఆటో ర్యాలీలు నిర్వహించాలన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే పాదయాత్రలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ నాయకులందరూ పాల్గొనాలన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు బాధ్యత తీసుకుని కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలన్నారు.
శ్రీశైలం నియోజకవర్గంలో 500 మందితో 19 అనుబంధ కమిటీలు ఏర్పాటు చేశామని, వీరందరూ పార్టీ కోసం సైనికుల్లా పని చేస్తూ నవరత్నాలు పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జగన్ చేయబోయే కార్యక్రమాలను వివరించాలన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన ‘రావాలి జగన్-కావాలి జగన్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని, జగన్‌ను అందరూ ఆదరిస్తున్నారని తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలో 3 రోజుల పాటు పాదయాత్ర నిర్వహిస్తామని, ప్రతి రోజూ 12 నుంచి 15 కి.మీ మేర పాదయాత్ర నిర్వహించి, పాదయాత్ర ఏ గ్రామంలో ముగుస్తుందో అక్కడే బస చేసి మరుసటి రోజు అదే గ్రామం నుంచి పాదయాత్ర కొనసాగిస్తామన్నారు. అలాగే 24వ తేదీ పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తామని, అందులో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలన్నారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వైసీపీ, మైనార్టీల ఓట్లను తీసి వేస్తున్నారని ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఓట్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం నవరత్నాలు కరపత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, అంజాద్‌అలి, బాలన్న, వెంకటరెడ్డి, కార్యకర్తలు, పాల్గొన్నారు.