కర్నూల్

బూత్ కమిటీల పటిష్టతే విజయానికి పునాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 24:రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలంటే బూత్‌స్థాయిలో పార్టీ పటిష్టంగా లేకపోతే సాధ్యం కాదని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయి. గత ఏడాది నంద్యాల ఉపఎన్నికలో ఈ విషయం స్పష్టమైందని ఆయా రాజకీయ పార్టీలు వెల్లడిస్తున్నాయి. నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ బూత్‌స్థాయిలో పని చేయకపోవడం వల్లే ప్రత్యర్థి టీడీపీ కూడా ఊహించని ఆధిక్యత లభించిందని వారు స్పష్టం చేస్తున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో బూత్‌స్థాయిలో కమిటీలను నియమించి అక్కడి నుంచే ఎన్నికల్లో విజయానికి మార్గం సుగమం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌లకు బూత్‌స్థాయిలో కార్యకర్తల బలం ఉన్నా గత సాధారణ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ మళ్లీ బూత్‌స్థాయి కమిటీలను బలోపేతం చేసుకోవడం ద్వారా ఎన్నికలకు సిద్ధపడనుంది. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో బూత్‌స్థాయిలో కమిటీలను బలోపేతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. గతంలో కాంగ్రెస్‌పార్టీ విజయంలో కీలక భూమిక పోషించిన బూత్ స్థాయి కమిటీలు 2014 ఎన్నికల్లో పని చేయకపోవడం వల్లే ఘోర పరాభవం ఎదురైందని ఆ పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి మళ్లీ దారిలోకి వస్తోందని దీని కారణంగా ప్రధానంగా బూత్‌స్థాయి కమిటీల నియామకం వైపు దృష్టి సారించామని వారంటున్నారు. ఇక అధికార టీడీపీ ఆవిర్భావం నుంచి బూత్ స్థాయి కమిటీలు పటిష్టంగా ఉన్నాయని ఇతర పార్టీల నేతలు సైతం అంగీకరిస్తున్నారు. నంద్యాల ఉపఎన్నికలో ఆ పార్టీ కూడా ఊహించని ఆధిక్యత రావడానికి కారణంగా ఒకటి డబ్బు అయితే రెండోది అత్యంత ప్రధానమైనది బూత్ కమిటీలు పటిష్టంగా ఉండటమేనని రాజకీయాల్లో సీనియర్లు పేర్కొంటున్నారు. వైసీపీకి సైతం బూత్ కమిటీలు బలంగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఓటమి అనంతరం బూత్ కమిటీలను పట్టించుకోకపోవడం, నంద్యాల ఉపఎన్నికలో అసలు బూత్ కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆ ప్రభావం పోలింగ్‌పై చూపిందని వారు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించి తాజాగా ఇంటింటికీ వైసీపీ కార్యక్రమంలో బూత్ కమిటీల పటిష్టతకు చర్యలు చేపట్టిందని వారు స్పష్టం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు బూత్ స్థాయి కార్యకర్తలకు రాజకీయ పార్టీల నేతలు గుర్తింపునిచ్చి వారితో చర్చలు జరపడంతో ఆయా పార్టీల కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతోంది.