కర్నూల్

విద్యార్థులకు పురుగలన్నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, సెప్టెంబర్ 24: విద్యార్థినులను అన్ని విధాలుగా సంరక్షించి నాణ్యమైన భోజనం పెట్టాల్సిన నిర్వాహకులే సద్దెన్నం, అందులోనూ పురుగులు పడిన అన్నం వడ్డిస్తే ఎలా అని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గుడిసె కృష్ణమ్మ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని ఆరేకల్ ఎస్సీ గురుకుల సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆమె తనిఖీలు నిర్వహించారు. అలాగే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ముందుగా వంటగది, స్టోర్‌రూంను తనిఖీలు చేయగా అనేక నిజాలు వెలుగు చూశాయని బూజు పట్టిన వేరుశెనగ విత్తనాలతో వంట చేస్తున్నారని ఆమె తెలిపారు. వసతి గృహానికి సరఫరా చేసిన ఆహార పదార్థలపై తయారైన తేదీ లేకపోవడం ఏమిటని వార్డెన్, ప్రిన్సిపాల్ రమణమ్మను ప్రశ్నించారు. తక్కువ తూకం ఉన్న ఇడ్లీ రవ్వ బస్తాలు ఎలా తీసుకున్నారని, తూకం వేసి తనిఖీ చేశారు. రాత్రికి విద్యార్థులకు వడ్డించాల్సిన అన్నం ఉదయం తయారు చేయడం ఏమిటని నిర్వాహకులను నిలదీశారు. రాత్రి అన్నం ఉదయం పెట్టడం.. ఉదయం తయారు చేసిన అన్నం రాత్రి పెట్టడం చూస్తే విద్యార్థులకు ఏమేరా నాణ్యమైన ఆహారం అందుతుందో తెలుస్తుందన్నారు. సాంబర్, కూరగాయాలు వంటలు ఎలాంటి రుచికరంగా లేవన్నారు. దీనివల్ల విద్యార్థులు చాలా వరకు అన్నం తినడం లేదని, బయట పారబోస్తున్నారని ఆమె తెలిపారు. తాగునీరు లేకపోవడంతో వాడే నీటినే తాగాల్సిన పరిస్థితి ఏర్పడడం విచారకరమన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్టఫ్రుడ్ కమిషన్‌కు ప్రత్యేకంగా నివేదికలు పంపిస్తామని, నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.