కర్నూల్

జగన్ పాదయాత్ర రాజకీయ చరిత్రలో ఓ మైలురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెస్టెంబర్ 24:వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్ప పాదయాత్ర రాజకీయ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తుందని ఆ పార్టీ నేత, విశ్రాంత ఐజీ షేక్ మహమ్మద్ పేర్కొన్నారు. టీడీపీ నయవంచన పాలనకు ప్రజలు చరమ గీతం పాడనున్నారని, ఆ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. ఇక మావోయిస్టులు అరకు ఎమ్మెల్యేతో పాటు మరొక మాజీ ఎమ్మెల్యేను హతమార్చడం అత్యంత బాధాకరమని, వారిది ఒక పిరికిపందె చర్య అన్నారు. జగన్ చేస్తున్న పాదయాత్ర 3 వేల కి.మీ పూర్తి చేసుకున్న సందర్భం పురస్కరించుకుని సోమవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్బాల్ మాట్లాడుతూ జగన్ యాత్ర 3 వేల కి.మీ పూర్తి కావడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ యాత్ర పూర్తయ్యే లోపు మరో 30 శాతం పెరిగి 73శాతం ప్రజల మద్దకు జగన్‌కు లభిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు అమెరికా యాత్ర ఒక బూటకమని విమర్శించారు. ప్రకృతి సేద్యం చేయడానికి 2.3 మిలియన్ డాలర్ల నిధులు ఖర్చు చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం కాదు రైతును కుదేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. శివరామకృష్ణ కమిషన్ నివేదిక రాకముందే సొంత రిపోర్టులతో రైతాంగానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. చంద్రబాబు బూటకపు ప్రచారాలతో రాష్ట్రం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారన్నారు. పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 6 జిల్లాల్లో కరవు విలయతాండవం చేస్తుంటే రైతులను ఆదుకోవడానికి ఖచ్చితమైన కార్యక్రమాలు చేపట్టడం లేదని దుయ్యపట్టారు. జగన్ తాను చేయబోయే ప్రజాహిత కార్యక్రమాలను చెప్పడం వల్ల ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. వైసీపీ బీజేపీని వ్యతిరేకించడం లేదని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ తీరుపై వైసీపీ పోరాటం చేస్తూనే ఉందన్నారు. చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీజేపీతో విభేదించారన్నారు. ‘నారా హమారా టీడీపి హమారా’ సభలో ముస్లిం యువకులపై దాడి అమానుషమన్నారు. రాష్ట్రంలో టీడీపీ ముస్లింలను పార్టీల వారిగా విభజించి తమాషా చూస్తుందన్నారు. కర్నూలు జిల్లా అంటేనే చంద్రబాబుకు కోపమని, ఇక్కడి ప్రజలు, మైనార్టీలు తనకు గత ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే ముస్లిం యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు పాలనపై నంద్యాల ముస్లిం యువకులు సీమ పౌరుషంతో ప్రశ్నించారన్నారు. చంద్రబాబు బూటకపు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.