కర్నూల్

గ్రామాల అభివృద్ధిలో వీఆర్‌ఓలు, కార్యదర్శులే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలూరు, సెప్టెంబర్ 24: గ్రామాల అభివృద్ధికి వీఆర్‌ఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కీలకమని, వీరు పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. సోమవారం వాసవి కల్యాణ మండపంలోల మీ కోసం, ప్రజాదర్బార్ కార్యాక్రమం నిర్వహించారు. ఉదయం 11.30లకు ఆలూరుకు చేరుకున్న కలెక్టర్ ప్రజాదర్బార్‌లో పాల్గొని ఆయా మండలాల నుంచి తరలి వచ్చిన జనం నుంచి అర్జీలను స్వీకరించారు. ఆయా సమస్యలపై స్పందించిన కలెక్టర్ అక్కడిక్కడే ఆయా శాఖల అధికారులతో పనులు పెండింగ్‌లో ఎందుకు ఉన్నాయని మండి పడుతూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు సక్రమంగా పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు అందించే బాధ్యత అధికారులదే అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పనితీరు పట్ల ఆయనపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆస్పరి ఈఓపై మండి పడుతూ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించిందన్నారు. పనితీరు మార్చుకోక పోతే సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా ఎంపీడీఓలు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనులకు అవసరం అయిన నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆస్పరి మండలం జోహారాపురం గ్రామానికి చెందిన దాదాపు 100 మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నప్పటికి ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదని గ్రామస్థులు రామాంజినేయులు, పుల్లయ్య, నాగేంద్ర, తదితరులు అర్జీని కలెక్టర్‌కు అందజేశారు. ప్రజాదర్బార్‌లో రెవెన్యూ సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. హౌసింగ్ అధికారులపై పలువురు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి వివరిస్తుండగా అధికార పార్టీ చెందినవారు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
నగర పాలికలో అవినీతిపై
సీబీఐ విచారణ జరిపించాలి
* ప్రొటోకాల్ పాటించని కమిషనర్‌ను తొలగించాలి
* జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 24:నగర పాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నగర పాలక సంస్థ కార్యాలయం అవినీతికి అడ్డగా మారిందని, ప్రతి అభివృద్ధి పథకంలో కమీషన్లు దండుకోవడం తప్ప ఏమీ లేదన్నారు. అమృత్ పథకంలో రూ. కోట్ల కుంభకోణం జరిగిందని, అందులో కమిషనర్‌తో పాటు అందరూ పంచుకున్నారన్నారు. నగరంలో 8 చోట్ల అత్యాధునిక సౌకర్యాలతో టాయిలెట్లు నిర్మించడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా రూ. 5 కోట్లు మంజూరు కాగా వాటిని ఎక్కడ నిర్మించారో తెలియదన్నారు. అలాగే పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు కాజేశారని, కావున నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ముగ్గురు అధికారులు ఏసీబీకి పట్టుబడడం చూస్తే నగర పాలక సంస్థ కార్యాలయంలో లంచాల పర్వం ఎలా సాగుతుందో తెలుస్తుందన్నారు. ఇక కమిషనర్ ప్రొటోకాల్ పాటించకుండా ఎంపీ బుట్టా రేణుకను అవమానిస్తున్నారని, ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, దీంతో ఎంపీ రేణుక ప్రొటోకాల్ వయిలేషన్ కమిటీ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఇకనైనా కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని, లేనిచో బీసీ సంఘాల తరఫున పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.