కర్నూల్

రాబోయేది వైసీపీ ప్రభుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, సెప్టెంబర్ 25:రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర 3వేల కి.మీ పూర్తయిన సందర్భంగా మంగళవారం కాటసాని బనగానపల్లె నుంచి పాతపాడు వరకూ 10 కి.మీ సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా కాటసాని పార్టీ శ్రేణులతో కలిసి కలిసి యాగంటిపల్లె, మీరాపురం మీదుగా పాతపాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీని గెలిపిస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నేతలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లాలో ప్రవేశించిందని ఆయన పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని ప్రజలందరూ జగన్ గెలుపును కోరుకుంటున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఎలాంటి వత్తిడి వచ్చినా తాము భరిస్తామని ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు టీడీపీ కార్యకర్తలకే చేరుతున్నాయని ధ్వజమెత్తారు.
రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో
జిల్లా జట్టుకు తృతీయ స్థానం
* జాతీయ స్థాయి పోటీలకు ఇద్దరు ఎంపిక
నందికొట్కూరు, సెప్టెంబర్ 25:ఈ నెల 21వ తేదీ నుంచి కృష్ణా జిల్లా కేతనకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి క్యాండిడేట్ అండ్ జూనియర్ జూడో పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచిందని జిల్లా జూడో సంఘం కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. స్థానిక నవనంది హైస్కూల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు ఈ పోటీల్లో 2బంగారం, 3 రజత, 4కాంస్య పతకాలు సాధించారన్నారు. పతకాలు సాధించిన సయ్యద్‌బాషా, షఫి, లీలావతి, కరీముల్లా, ఇమ్రాన్, మధు, భానుషక్రాష్, పెద్దస్వామి, అమర్నాథరెడ్డిలను అభినందించారు. రాష్టస్థ్రాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన శాలుబాషా, షఫి జాతీయ స్థాయికి ఎంపికయ్యారన్నారు. వారు అక్టోబర్ 24 నుంచి 28వ తేదీ వరకూ అస్సాంలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.