కర్నూల్

28న రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 25:నగరంలోని బిర్లాగేట్ సమీపంలో క్రిష్ణానగర్‌లో చేపడుతున్న రైల్వే అండర్ బ్రిడ్జిని ఈ నెల 28వ తేదీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రారంభిస్తారని నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి తెలిపారు. కమిషనర్ మంగళవారం ఆ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాచ్ వర్క్, క్యూరింగ్, మట్టి, వ్యర్థాల తొలగింపు, తదితర పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. భవిష్యత్తులో వాహనదారులు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల చాలా వరకూ క్రిష్ణానగర్, ఐటీసీ, కల్లూరు వెళ్లే మార్గాల గుండా వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ సమస్య నుంచి ఊరట లభిస్తుందన్నారు. అలాగే జాతీయ రహదారి నుంచి వెళ్లే భారీ వాహనాలు నగర శివారు నుంచి వెళ్లడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం
* ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు పుణ్యవతి
కర్నూలు ఓల్డ్‌సిటీ, సెప్టెంబర్ 25:మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్.పుణ్యవతి ఆరోపించారు. స్థానిక మున్సిపల్ ఓపెన్ థియేటర్ ఆవరణలో మంగళవారం ఐద్వా జిల్లా 10వ మహాసభలు జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘బేటీ బచావ్ బేటీ పడావ్’ నినాదం ఆచరణలో లేదని మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించకుండా విదేశీ పర్యటనలతో కాలం గడుపుతున్న ప్రధానికి వచ్చే ఎన్నికల్లో మహిళలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను ముస్లిం మహిళలపై ప్రేమతో తెచ్చాడా, మతంపై దాడి కోసం తెచ్చాడా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. నేడు మద్యం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మద్యపానం నిషేధించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి అనంతకుమార్ మనుధర్మ శాస్తమ్రే అవసరం రాజ్యంగం అవసరం లేదని అంబేద్కర్, గాంధీలను అవమాన పరుస్తున్నారని తెలిపారు. మతోన్మాద ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పీ.నిర్మల మాట్లాడుతూ మద్యం షాపులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక మద్యం షాపులను మూత వేయించామన్నారు.