కర్నూల్

అమ్మవారి ఆలయంలో పాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, సెప్టెంబర్ 25: మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయంలో పాము చొరబడి భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే మంగళవారం సాయంత్రం హారతుల సమయంలో నల్లమల అడవిలో నుండి దాదాపు 8 అడుగుల పాము ఆలయంలోకి వచ్చింది. అమ్మవారి ఆలయంలోని పీటం సమీపంలో ఉన్న రంద్రం ద్వారా ఆలయంలోకి వచ్చినట్లు అర్చకులు గమనించారు. అయితే ఎంత వెతికినా కనిపించకపోవడంతో భక్తులు భయబ్రాంతులకు గురవుతారన్నా ఉద్దేశ్యంతో ఆలయ అధికారులు సమాయత్తమై హారతులు ఇచ్చి భక్తులను బయటకు పంపారు. వెంటనే పాములు పట్టే స్థానికుడు అయిన రాముడును పిలిపించి పామును పట్టుకొనేందుకు ప్రయత్నించారు. అయితే ప్రధాన అమ్మవారి ఆలయాన్ని విడిచి బయట ఆలయంలో ఉన్న చిన్న అమ్మవారి (పాత అమ్మవారి)కి చుట్టుకొని ఉండడాన్ని గమనించిన రాముడు చాకచక్యంగా దాన్ని పట్టుకున్నాడు. దీంతో ఎలాంటి ఆపద జరుగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న పామును అడవిలోకి తీసుకువెళ్లి వదిలి పెట్టారు.
సకాలంలో వర్షాలు కురవాలంటే హోమాలు చేయాలి
నంద్యాలటౌన్, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురియాలంటే తప్పనిసరిగా హోమాలు చేయాల్సిందేనని, అప్పుడే వాతావరణంలో హెచ్చుతగ్గులు తగ్గి వర్ష రుతువులోనే వర్షాలు కురుస్తాయని అమరయోగ వికాస కేంద్రం నిర్వాహకులు యోగాచార్య అచల పరిపూర్ణయోగానంద పాములేటి స్వామి అన్నారు. మంగళవారం పౌర్ణమి పురస్కరించుకుని ఆశ్రమ ఆవరణంలో 108 యజ్ఞ వేదికలతో లోకకల్యాణార్థం హోమాలను భక్తులతో చేయించారు. ఈసందర్భంగా భక్తులను ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు కురవకపోవడంతో ఉక్కపోతతో పాటు రైతుల పంటలు ఎండిపోతున్నాయని, దీనికి పరిష్కారం మార్గం హోమాలు చేయడమేనన్నారు. భగవంతునికి పూజలతో పాటు ప్రతి ఆలయంలో, గ్రామంలో హోమాలు చేయిస్తే తప్పనిసరిగా వర్షాలు కురుస్తాయన్నారు. పూర్వం వర్షాలు కురవకపోతే హోమాలు చేసి వర్షాలు కురిపించే వారన్నారు. ప్రస్తుతం ఆధునిక కాలంలో హోమాల ఆవశ్యకతను మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హోమంలో జమ్మి, రావి, తుమ్మి, తదితర వనమూలికలతో పాటు ఇతర ద్రవ్యాలు వేయడంతో వచ్చే ధూమం గాలిలో కలిసి కాలుష్యాన్ని శుద్ధి చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ హోమాలు చేసి వాతావరణాన్ని శుద్ధి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అనంతరం తీర్థప్రసాదాలను భక్తులకు ఏర్పాటు చేశారు.