కర్నూల్

పేలుడు పదార్థాల లారీ సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 25:పేలుడు పదార్థాల లారీని సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కర్నూలు 4వ పట్టణ సీఐ డి.మహేశ్వరరెడ్డి తెలిపారు. అందుకు సంబంధించి సీఐ మంగళవారం స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అందిన సమాచారం మేరకు సోమవారం నగరంలోని విష్ణుటౌన్ షిప్ వద్ద పేలుడు పదార్థాలను లోడ్ చేసుకుని ఉన్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన లారీని సీజ్ చేశామన్నారు. అందులో 425 క్రాకర్స్ బాక్స్‌లను కూడా స్వాధీనం చేసుకుని చిన్నన్ సత్తివేలు, బషీర్ అహమ్మద్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా 4వ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బాణసంచా దుకాణదారులు, వ్యాపారులు పోలీసుల నిబంధనలు పాటించాలన్నారు. పండుగ సందర్భంగా టపాసులను ప్రభుత్వ లైసెన్స్ ఉన్న వారు మాత్రమే విక్రయించాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించినా, నిల్వ ఉంచినా చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. లైసెన్స్ ఉన్నప్పటికీ నిర్వాహకులు బాణసంచా గోడౌన్‌లలో నిల్వ ఉంచాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. నిర్ధేశించిన ప్రదేశాల్లో తప్ప వేరే ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో బాణసంచా విక్రయించరాదన్నారు. పోలీసుల నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీదే విజయం
* ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి
ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 25: రానున్న ఎన్నికల్లో వైకాపాదే విజయం అని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. వైకాపా అధ్యక్షులు జగన్ చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్ర 3వేల కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా జగన్‌కు సంఘీభావంతో ఎమ్మెల్సీతోపాటు వైకాపా ఇంచార్జి గంగుల బిజేంద్రారెడ్డిలు మంగళవారం నుండి మూడు రోజుల పాటు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఉదయం స్వగృహం నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు నాలుగురోడ్ల కూడలికి చేరుకొని అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్ర ఎంపీడీఓ కార్యాలయం మీదుగా చింతకుంటకు చేరుకున్నారు. అక్కడి నుండి భాగ్యనగరం, కొండాపురం, పేరాయిపల్లె, నల్లగట్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గంగుల మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు వేల కి.మీ నడుస్తూ ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు వారి సమస్యలను మాకు వివరిస్తే ఆ సమస్యలను ఎన్నికల ప్రణాళికలో పొందుపరుస్తామన్నారు. నవరత్నాల గురించి వివరించారు. జగన్ అధికారంలోకి వస్తే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటుధర కల్పిస్తామన్నారు. బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ మనం ఒక్క రోజు ఎండలో పాదయాత్ర చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఐతే జగన్ గత 9 నెలలుగా ఎండా, వానలను లెక్కచేయకుండా ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఇప్పటి వరకు 3 వేల కి.మీ నడవడం మామూలు విషయం కాదన్నారు. జగన్ పాదయాత్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.