కర్నూల్

ఉన్నత శిఖరాలు అధిరోహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 2:ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. బి.తాండ్రపాడు టీటీడీసీలో మంగళవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-సీడాక్ ఆధ్వర్యంలో దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రభుత్వం నిరుపేద నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ ట్రేడ్‌లలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒకరిపై ఆధారపడకుండా మనకాళ్లపై మనమే నిలదొక్కుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో పాటు నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని, అప్పుడే జీవితంలో మరింత ఆనందం పొందవచ్చన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారందరూ బ్యాంకుల ద్వారా రుణాలు పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. మీ సేవా కేంద్రాల స్థాపన, డైరీ, పౌల్ట్రీ, డిపార్టుమెంటల్ స్టోర్స్, తదితర చిన్నపాటి పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. వివిధ రంగాల్లో మీకు శిక్షణ ఇస్తామని, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం కలెక్టర్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి కంప్లీషన్ సర్ట్ఫికెట్, ఉద్యోగం పొందిన వారికి నియామక పత్రాలు ప్రదానం చేశారు.