కర్నూల్

‘మీ సేవా’ దరఖాస్తులు మాత్రమే స్వీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 11:మీ సేవా కేంద్రంలో వీఆర్‌ఓ, ఆర్‌ఐ, తహశీల్దార్ల సంతకాలతో పూరించిన కుల ధ్రువీకరణ, ఆదాయ, తదితర దరఖాస్తులను తిరస్కరించి కేవలం నమోదు చేసుకున్న దరఖాస్తులను మాత్రమే స్వీకరించాలని జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మీ సేవా కేంద్రాల ఆపరేటర్లను ఆదేశించారు. మీ సేవా కేంద్రాల పనితీరు మెరుగుపై గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కుల ధ్రువీకరణ, ఇతర సర్ట్ఫికెట్ల జారీకి రెవెన్యూ సిబ్బంతి నిర్ణీత గడువులోగా విచారించి మంజూరు చేస్తారని, మీ సేవా ఆపరేటర్లు కేవలం సర్వీసు అందించడం మాత్రమే చేయాలన్నారు. రెవెన్యూ సిబ్బంది సంతకాలతో దరఖాస్తులు స్వీకరిస్తే సంబంధిత మీ సేవా కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు సర్వీసు అందించడంలో లోపాలు వున్నట్లు అనేక ఫిర్యాదులతో పాటు ప్రజల అంతృప్తి శాతం కూడా ఎక్కువ ఉందని ఇకనైనా పద్ధతి మార్చుకుని కాలపరిమితిలోపు సేవలందించాలని జేసీ ఆదేశించారు. సెంటర్లలో తాగునీరు, సీటింగ్ లాంటి కనీస ఏర్పాట్లు చేయడంతో పాటు దరఖాస్తుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. యువ నేస్తం అప్‌లోడ్, ఇతర దరఖాస్తులకు అధిక మొత్తంలో రుసుం తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వం నిర్ణయించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలన్నారు. ఏ దరఖాస్తుకు ఏమేర రుసుము, అందించే సేవలపై బోర్డు ప్రదర్శించాలన్నారు. ప్రతి దరఖాస్తుకు ఖచ్చితమైన రశీదు అందజేయాలన్నారు. సర్వీసు ఆపరేటర్లు ఫీడ్ బ్యాక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు నిర్ణీత గుడువులోగా సంబంధిత రశీదులను అందజేయాలన్నారు. మీ సేవా ఆపరేటర్లు టెలిగ్రాం యాప్ డౌన్‌లోడ్ చేసుకోని గ్రూపులో జాయిన్ అయితే సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తామన్నారు. ఈ పట్టాదారు పాసుబుక్‌కు సంబంధించి బయోమెట్రిక్ డివైజ్‌ను ఈ నెలాఖరులోపు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రజల సంతృప్తి స్థానంలో జిల్లా చివరిలో వుందని కావున మీ సేవా ఆపరేటర్లు పనితీరు మెరుగుపరచుకుని ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. ఇకపై మీ సేవా కేంద్రాలను తరచూ తనిఖీ చేస్తామని ఏవైనా లోపాలు వెల్లడైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నంది అవార్డు గ్రహీతకు ఎస్పీ జెట్టీ సన్మానం
కర్నూలు, అక్టోబర్ 11:కర్నూలు హోంగార్డు యూనిట్‌లో పని చేస్తున్న హోంగార్డు రెడ్డిపోగు శామ్యూల్ నంది పురస్కారం సాధించినందుకు గురువారం ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ తన కార్యాలయంలో సన్మానించి అభినందించారు. 2018 నందినాటక ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో జరిగిన 21వ నంది నాటకోత్సవానికి శామ్యూల్ జిల్లా తరఫున పాల్గొన్నారు. ఆ పోటీల్లో ‘‘సై సైరా నరసింహారెడ్డి’’ పద్యనాటకంలో శామ్యూల్ పానకాలు పాత్ర పోషించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతికశాఖ ఉత్తమ హాస్యనటుడిగా గుర్తించి ఏలూరులోని క్రాంతి ఫంక్షన్ హాలులో సినిమాటోగ్రఫీ చైర్మన్ అంబికా కృష్ణ, ఎంపీ మాగంటి మురళీమోహన్ శామ్యూల్‌ను నంది అవార్డుతో సత్కరించి రూ. 15వేల నగదు అందజేశారు.