కర్నూల్

బ్రహ్మచారిణి అంకారంలో శ్రీచౌడేశ్వరీమాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, అక్టోబర్ 11:శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం నందవరం శ్రీచౌడేశ్వరీమాత బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున 5 గంటలకే అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక అలంకారాలు పూర్తిచేశారు. అనంతరం ప్రత్యేక మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి బ్రహ్మచారిణి అలంకారం నిర్వహించి భక్తుల దర్శనార్థం వుంచారు. ఈఓ రామానుజన్, ఆలయ కమిటీ చైర్మన్ పీవీ కుమార్‌రెడ్డి భక్తుల రద్దీకి అనువుగా ఏర్పాట్లు చేశారు. కాగా శ్రీచౌడేశ్వరీమాతను మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధిరెడ్డి సతీమణి బిజ్జం ప్రణీతరెడ్డి దర్శించుకున్నారు. అంతకుముందు ఆమెకు ఈఓ, చైర్మన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పట్టణంలోని కొండపేట అమ్మవారిశాలలో వాసవాంబ శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు బింగిమళ్ల సత్యంశెట్టి ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం చిన్నారులకు వివిధ సాంస్కృతిక, ఆటల పోటీలు నిర్వహించారు. స్థానిక శ్రీఅయ్యప్పస్వామి ఆలయంలో గాయత్రీదేవీకి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారం చేశారు. ఇక శుక్రవారం నందవరం శ్రీచౌడేశ్వరీమాత చంద్రఘంటా అలంకారంలో, అమ్మవారిశాలలో వాసవాంబ శ్రీగాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.
రైతులకు మెరుగైన సేవలు అందించాలి
* ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ డైరెక్టర్ రాంబాబు
బనగానపల్లె, అక్టోబర్ 11:కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులు, పాడిపరిశ్రమ, మహిళలకు మెరుగైన సేవలు అందించేందుకు వున్నాయని ఈ దిశగా వారు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు చేయాలని గుంటూరు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్స్‌టెన్షన్ డైరెక్టర్ పీ.రాంబాబు సూచించారు. ఆయన గురువారం నంద్యాల వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ సంచాలకులు సుబ్బారావుతో కలిసి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం అభివృద్ధకి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని, ఆ నిధులను కేవీకేలు, వ్యవసాయ శాఖ అధికారులు సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత వుందన్నారు. అనంతరం వారు కేవీకేలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు, వర్మీకంపోస్టు, పాడిపశువుల యూనిట్లు, వ్యవసాయ క్షేత్రాలు, ల్యాబ్‌యూనిట్లు, సీడ్ హబ్, షేడ్ నెట్, తదితర వాటితో పాటు మీరాపురం వ్యవసాయ పొలాలను పరిశీలించారు. యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం పనితీరును అభినందించారు.