కర్నూల్

బ్రహ్మచారిణిదుర్గగా కామేశ్వరీదేవి దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, అక్టోబర్ 11: శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రెండవ రోజున గురువారం మహానంది పుణ్యక్షేత్రంలో శ్రీ కామేశ్వరీ అమ్మవారు బ్రహ్మచారిణిదుర్గగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కామేశ్వరీ సమేత మహానందీశ్వర స్వామివార్లకు వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్‌భట్, తదితరులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో విశేష ద్రవ్య అభిషేకార్చన పూజలు నిర్వహించారు. ఇక ఉభయ దాతలైన డా.మహేంద్రకుమార్‌రెడ్డి, బిందురెడ్డి దంపతులు, రామచంద్రుడు, విజయలక్ష్మి దంపతులు, సుధాకర్‌రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు, వెంకటరెడ్డి, కవితారెడ్డి దంపతులు, నూరి నాగశేషఫణిశర్మ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక యాగశాలలో వేదపండితులు దాతలకు కంకణధారణ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగ ప్రత్యేక యాగశాలలో రుద్ర, చండీ, గణపతి హోమాలు నిర్వహించారు.
సింహ వాహనంపై అమ్మవారి గ్రామోత్సవం..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం శ్రీ కామేశ్వరి అమ్మవారిని బ్రహ్మచారిణి దుర్గ అలంకారంలో సింహవాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం శ్రీ కామేశ్వరి అమ్మవారిని బ్రహ్మచారిణిగా అలంకరించి సహస్ర దీపాలంకరణ సేవను వేదమంత్రాలతో దాతలు, అధికారులచే కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం సింహవాహనంపై కొలువుదీరిన అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకృతులను చేసి ప్రత్యేక పూజలు, అష్టావిధ మహా మంగళహారతులు ఇచ్చారు. నారికేళ కూష్మాంఢబలి ఇచ్చి అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభించారు. అమ్మవారి పల్లకి ఆలయం ప్రదర్శనగా నాలుగు మాడావీధుల్లో విహరించారు. అనంతరం దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.