కర్నూల్

ఆళ్లగడ్డను మరింత అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, అక్టోబర్ 11: ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద నిర్మిస్తున్న అన్నా క్యాంటిన్ భవన నిర్మాణం పనులను మంత్రి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖర్లతో మాట్లాడుతూ ఏసీఎన్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ బ్యాంకు సాయంతో ఆళ్లగడ్డ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రూ. 111.48 కోట్లు మంజూరు చేసిందన్నారు. గండ్లేరు రిజర్వాయర్ నుంచి నీటిని ఆళ్లగడ్డకు తీసుకొనివచ్చి నగరపంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికీ రక్షత మంచినీరు అందిస్తామన్నారు. ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ నిబంధనల ప్రకారం రోజుకు ఒక్కొక్కరికీ 135 నీటిని అందజేస్తామన్నారు. రానున్న 30 సంవత్సరాల పాటు తాగునీటి సమస్య రాకుండా పథకాన్ని తయారు చేశామన్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ప్రజలకు మాటిచ్చానన్నారు. దాన్ని నెరవేర్చినందుకు సంతోషంగా వుందన్నారు. అన్న క్యాంటీన్ ద్వారా పేదప్రజలకు రూ. 5కే నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నామన్నారు. అన్న క్యాంటీన్ నిర్మాణం పూర్తిచేసుకొని త్వరలో ప్రారంభవౌతుందన్నారు. మరో రెండు క్యాంటీన్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నగరపంచాయతీలో స్వంత ఇంటి కలగా వున్న పేదలకు జీ ప్లస్ 3 ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. ఇందుకోసం స్థల పరిశీలన పూర్తయిందన్నారు. టిడ్‌కోకు ఇళ్ల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు కేటాయించామన్నారు. త్వరలో భూమిపూజ చేస్తామన్నారు. దాదాపు 2500 మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
నవరత్నాలు కాదు.. నకిలీ రత్నాలు
* ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
ఎమ్మిగనూరు, అక్టోబర్ 11: వైకాపా నాయకులు జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ప్రకటిస్తున్నవి నవరత్నాలు కావు.. నకిలీ రత్నాలు అని డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅథితిగా కేఈ హాజరయ్యారు. ఈ మేరకు పట్టణంలో సోమప్ప సర్కిల్ నుండి మార్కెట్‌యార్డు వరకు రోడ్‌షా నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ కేంద్రంలో మోదీని ఎదురించే శక్తి ఒక్క చంద్రబాబునాయుడుకు ఉందన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 80 శాతం నెరవేర్చడం జరిగిందన్నారు. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రూ.22వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికిదే దక్కిందన్నారు. జిల్లాలో రైతులను ఆదుకునేందుకు 68 చెరువులకు నీళ్లు మళ్లించి తాగు, సాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలను ఎదురించే వ్యక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందని, విదేశీలు కూడా ఈవిషయంపై హర్షిస్తున్నారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు సేంద్రియ ఎరువులతో పంటలు పండించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రూ.16కోట్లు వెచ్చించిందన్నారు. నిరంతరాయంగా 7 గంటల విద్యుత్ అందించే ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం మాత్రమేనని తెలిపారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక 80 దేశాలు తిరిగి అక్కడ అభివృద్ధిని చూసి మనదేశంలో డీజల్, పెట్రోల్ ధరలను పెంచి అభివృద్ధి జరిగిందనుకోవడం విచారకరమన్నారు.