కర్నూల్

కనీస మార్పులు సాధించని సంతోష సూచి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 11: జిల్లాలో ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా సంతోష సూచి కనిపించకపోవడమే కాకుండ కనీస స్థాయిలో కూడా మార్పులు సాధించలేకపోయిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ తీరు, సంక్షేమ పథకాల అమలు ప్రజలకు అందుతున్నా ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయం తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి దఫ దఫాలుగా సర్వేలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు స్థానికంగా నాయకుల వ్యవహార శైలి, పథకాల అమలులో అధికారులు అనుసరిస్తున్న విధానాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రజల సంతృప్తి 50 శాతం ఉండాలన్నది ముఖ్యమంత్రి పదేపదే చెబుతూ వస్తున్నారు. ఆ స్థాయిలో ప్రజలు సంతృప్తిగా ఉంటేనే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధిస్తుందన్నది ఆయన అభిప్రాయం. ఈ సంతోష సూచి సర్వేలో జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండి చంద్రబాబు ఆశిస్తున్న 80 శాతంలో సగం కూడా ప్రజల్లో సంతృప్తి కనిపించడం లేదన్నది తేలినట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రభుత్వం, స్థానిక నేతలు, అధికారుల వ్యవహార శైలి తదితర అంశాలపై 33, 34 శాతం మాత్రమే ప్రజల్లో సంతృప్తి వ్యక్తమైనట్లు స్పష్టమవుతుంది. ఇవి చంద్రబాబు బహిరంగంగా చెప్పకపోయినా జిల్లా పార్టీ నేతల సమావేశంలో పరోక్షంగా ప్రస్తావిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కొద్ది కాలం క్రితం సర్వేలో కనీస స్థాయిలో కూడా ప్రజలు సంతోష సూచిలో మార్కులు వేయకపోవడం ఆ పార్టీ నేతలను గందరగోళానికి గురిచేస్తోంది. కాగా సంతోష సూచిలో ప్రజల సంతృప్తి స్థాయి కనీస స్థాయిలో కూడా లేకపోవడానికి ప్రభుత్వ విధానాలా? స్థానిక నేతలా? కారణం ఎవరా? అన్నది చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో 2014 ఎన్నికల్లో 11 స్థానాలు సాధించిన వైకాపా, తెలుగుదేశం పార్టీని మట్టికరిపించింది. జిల్లాలో ఓటర్లు ఏకపక్షంగా వైసీపీకి మద్దతు పలుకడాన్ని ముఖ్యమంత్రి సైతం జీర్ణించుకోలేక పోయారు. జిల్లా పర్యటనలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి జిల్లా ప్రజలను వైసీపీకి మద్దతు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రజలు జిల్లాలో టీడీపీని గెలిపించకపోయినా, ఆ మాత్రం అభివృద్ధి చేయడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించబోనని అనేక హామీలు గుప్పించారు. అయితే ఈ హామీలన్నీ ఒక దశకు కూడా చేరుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుంతోంది. తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేసినప్పటికి ప్రజల్లో సంతృప్తి కనిపించలేదు. ఈ పనులను పూర్తి చేయడం వెనుక అనంతపురం, కడప జిల్లాలకు మేలు చేయడం కోసమేనన్నది ప్రజాభిప్రాయంగా తెలుస్తోంది. నిత్యం కరవుతో విలవిలలాడే పడమర ప్రాంతంలోని తుంగభద్ర దిగువ కాల్వ, వేదవతి ఎత్తిపోతల, గుండ్రేవుల జలాశయ నిర్మాణం వంటి సమస్యలు ఒక్క శాతం కూడా ముందుకు పోలేదని రాజకీయ విశే్లషకులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండ కరవు వచ్చినా కరవు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవడంలో కూడా మీనమేషాలు లెక్కించడం ప్రజల్లో అసంతృప్తికి కారణం అయి వుండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాలు, వ్యక్తిగత లబ్ధిని చేకూర్చే పథకాల విషయంలోకూడా గత ప్రభుత్వాలతో పోల్చుకొని ప్రస్తుత ప్రభుత్వ విధానాలు బేరీజు వేసుకొని పెదవి విరిచి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు జిల్లాలో నేతలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి కొత్త పథకాలను, ముఖ్యమంత్రి హామీల అమలు వంటి అంశాలపై సత్ఫలితాలను సాధించకపోవడం కూడా కారణమని లెక్కలు వేస్తున్నారు. ఏదేమైనా ముఖ్యమంత్రి కోరుతున్నట్లుగా సంతోష సూచిక 80 శాతం పక్కన పెడితే కనీస స్థాయికి చేరుకోకపోవడంపై టీడీపీలో గుబులు రేకెత్తిస్తోంది.
కరవు రైతులను ఆదుకునేందుకు చర్యలు
* ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
ఎమ్మిగనూరు, అక్టోబర్ 11: రాష్ట్రంలో కరవు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డు పాలక మండలి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలలను కృష్ణడెల్టాకు మళ్లించి శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమ ప్రాంతానికి తాగునీరు అందించాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబునాయుడు అడుగులు వేస్తుంటే ప్రతిపక్ష వైకాపా నాయకులు రాజకీయం అనుభవం లేని జనసేన పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించడం తగదన్నారు. జిల్లాలో పశ్చిమ భాగాన వర్షాలు లేక కరవు విలయతాండం చేస్తోందని, కరవు నివారణ చర్యలు తీసుకుని అన్నదాలతను, రైతులను కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మిగనూరు మార్కెట్‌యార్డు పాలక వర్గం ప్రమాణస్వీకారంతో జీఓలో కొన్ని పొరపాట్లు ఉన్నందున హైకోర్టు స్టే విధించినప్పటికీ ప్రభుత్వ పరంగా జీఓను సరిచేసి ఇదే పాలక వర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తామన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి నూతన మార్కెట్‌యార్డు చైర్మన్ మాధవరావుదేశాయ్ ఆధ్వర్యంలో మెమొంటో, పూలమాల వేసి, శాలవతో ఘనంగా సన్మానించారు.