కర్నూల్

ప్రజా శ్రేయస్సు కోసం నిరంతర కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, అక్టోబర్ 13:రాష్ట్ర ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మణిగాంధీ తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలోని బాలాజీనగర్, స్టాంటన్‌పురం కాలనీల్లో రూ. 3కోట్ల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డితో కలిసి భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతుందన్నారు. ప్రజలకు వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుందన్నారు. నగర శివారు కాలనీలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఏపీ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. కమిషనర్ మాట్లాడుతూ నగర పాలక సంస్థ పరిధిలోని కాలనీల్లో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బాలాజీనగర్, స్టాంటన్‌పురం కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాల పనులను ప్రారంభించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాం కలగకుండా చూస్తామన్నారు. మున్సిపల్ అనుమతి లేకుండా వేస్తున్న అనధికార లేఔట్లపై కఠినంగా వ్యవహిరించి, అందుకు బాధ్యులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైనేజీ కాలువలపై అక్రమంగా నిర్మాణాలు చేపడితే తొలగిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, డీఈ రాజశేఖర్, ఏఈలు నాసిర్, ప్రకాష్, ఆర్‌ఓ మల్లికార్జున, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆంజేనేయులుగౌడ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమల్లో పత్తి కొనుగోలును అరికట్టాలి
ఆదోనిటౌన్, అక్టోబర్ 13:వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో ఈ పేమెంట్ విధానం అమలు కావాలంటే అధికారులు పరిశ్రమల్లో నేరుగా పత్తి కొనుగోలును అరికట్టాలని అప్పుడే సాధ్యమవుతుందని ఆదోని కమిటీ కమీషన్ ఏజెంట్ల సంఘం నాయకులు బ్రహ్మయ్య, కొలిమి రామన్న, వీరభద్రగౌడ్, బత్తిన బ్రహ్మయ్య పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో శనివారం గ్రేడ్-1 కార్యదర్శి రామరావు ఆధ్వర్యంలో చైర్మన్ దేవేంద్రప్ప అధ్యక్షతన కమీషన్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతుల పంటల ఉత్పత్తులను ఈ పేమెంట్ ద్వారానే అమ్మకాలు చేయాలని, వారికి బ్యాంకు ఖాతాల ద్వారానే ఎప్పటికప్పుడు నగదు చెల్లించాలని ఈ పేమెంట్ విధానానికి సహకరించాలని కోరారు. కమీషన్ ఏజెంట్లు మాట్లాడుతూ రైతులు బ్యాంకులో తీసుకున్న అప్పులు, ఇతర బకాయిలను బ్యాంకు అధికారులు కోత విధిస్తారని రైతులు ఇందుకు సహకరించడం లేదన్నారు. దీనికి తోడు పరిశ్రమల్లో నేరుగా పత్తికొంటున్నారని దీంతో పత్తి అమ్మకానికి యార్డుకు రావడం తగ్గిందన్నారు. అలాగే కొందరు వ్యాపారులు ఐపీ పెట్టడం వల్ల తాము నష్టపోతున్నామని ప్రభుత్వం ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.