కర్నూల్

వన్ ఆర్ కాలువ వెంబడి జలచౌర్యంపై కదిలిన రైతుదండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడుబూరు, అక్టోబర్ 13:ఎల్లెల్సీ పరిధిలోని సూగూరు డిస్ట్రిబ్యూటర్ కింద వన్‌ఆర్ కాలువ వెంబడి అక్రమ ఆయకట్టుకు వినియోగిస్తున్న జలచౌర్యంపై ఆయకట్టు రైతుల దండు శనివారం కనె్నర్ర చేసింది. వందల మంది రైతులు చెలిక పార పట్టి వన్‌ఆర్ కాలువ వెంబడి కదం తొక్కారు. ఇందులో భాగంగా సూగూరు డిస్ట్రిబ్యూటర్ వద్ద వన్‌ఆర్ కాలువ నుంచి అక్రమ ఆయకట్టుకు సాగునీటిని తరలించే కాలువ గండ్లను పూడ్చివేశారు. గౌరమ్మ కాలువ, శంకరరెడ్డి కాలువ, రమాకాంతరెడ్డి కాలువ, రవిచంద్రారెడ్డి కాలువల ద్వారా అక్రమ ఆయకట్టులోని పత్తి, మిరప పంటలకు సాగునీటి తరలింపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్‌ఆర్ కాలువ వెంబడి భూస్వాములు అక్రమ ఆయకట్టును పెంచి పోషించడం ద్వారానే ఆయకట్టులోని వరి పంటకు సాగునీరు అందక రైతులు రాత్రింబవళ్లు కష్టపడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు. వన్‌ఆర్ కాలువ వెంబడి ఉన్న భూస్వాముల ఒత్తిడికి తలొగ్గిన ఇరిగేషన్ అధికారులు అక్రమ ఆయకట్టు జలచౌర్యంపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయకట్టు రైతులు నవీన్‌రెడ్డి, పాలన్న, సిద్దప్ప, చిన్న యాకోబు, శ్రీనివాసులు, తదితరులు వాపోయారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఆయకట్టులోని తమ వరి పైర్లు ఎండిపోతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లెల్సీ నీటి మట్టం తగ్గినప్పటికీ సల్లమ్మవాగు వద్ద చిన్నతుంబళం చెరువుకు మాత్రం నిత్యం అయిదారు రింగుల నీళ్లు తరలిస్తూనే ఉండడంతో తమకు శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్ ఆర్ కాలువ వెంబడి అక్రమ ఆయకట్టు గండ్లను పూడ్చి వేశామని, తిరిగి కాలువకు గండ్లు కొట్టకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వన్ ఆర్ కాలువ పరిధిలో ఆయకట్టు పొలాల్లో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వరి పైర్లు సాగు చేశామని తెలిపారు. వరి పైర్లు గొరుగు, పొట్టదశలో ఉన్నాయని, ఈ సమయంలో నీటి కొరత ఏర్పడితే తాము అప్పుల పాలవుతామని రైతులు వాపోయారు. సాగునీరు అందక తమ వరిపైర్లు ఎండిపోతే ఇరిగేషన్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.