కర్నూల్

ఆదర్శంగా పీఎంఏవై ఎన్టీఆర్ గృహాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, నవంబర్ 15: దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోనే పీఎంఏవై - ఎన్టీఆర్ గృహాలను షేర్‌వాల్ టెక్నాలజీ ద్వారా ఎంతో ఆదర్శంగా నిర్మిస్తున్నామని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ అన్నారు. గురువారం జగన్నాథగట్టులో హౌస్ ఫర్ ఆల్ కింద నిర్మాణం చేపడుతున్న పీఎంఏవై గృహాలను కలెక్టర్ సత్యనారాయణ, నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి, టిడ్కో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు 6788 గృహాలు పూర్తి కాగా వీటిలో 5640 గృహాలు లబ్ధిదారులు గృహా ప్రవేశాలు చేసుకోవడానికి వీలుగా ఉన్నాయన్నారు. అలాగే గృహా ప్రవేశాలు చేసిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడకుండా సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి వసతి వంటి సౌకర్యాలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్‌ఈ సురేంద్రబాబు, ఎంఈ రమణమూర్తి, షాపుర్జీ పలంజీ అధికారులు గోకర్ణ శాస్ర్తీ, ఇంజనీర్ రాజశేఖర్, డీఈ రాధాకృష్ణ, టౌన్ ప్లానింగ్ డీసీపి కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలతో కలసి ఛాయ్ తాగిన
మాజీ సీఎం కిరణ్‌కుమార్
డోన్, నవంబర్ 15: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం డోన్‌కు వచ్చి కార్యకర్తలతో కలసి ఛాయ్ తాగి వెళ్లి పోయారు. అనంతపురం పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్తూ గురువారం రాత్రి డోన్ బైపాస్ రోడ్డులోని ఓ టీ హోటల్ వద్ద కొద్దిసేపు ఆగారు. కార్యకర్తల కోరిక మేరకు ఛాయ్ తాగి వెళ్లి పోయారు. ముందుగా మాజీ సీఎం కిరణ్ వస్తున్నట్లు తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.