కర్నూల్

పొలాల వద్దే రైతుల పడిగాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, నవంబర్ 15: ఎస్సార్బీసీ ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా వుంది. పంటల నీరు అందించుకునేందుకు రైతులు పొలాల వద్దనే రేయింబవళ్లు వుండాల్సి వస్తుంది. ఎస్సార్బీసీ కాల్వలో 5/3 పద్ధతిని అధికారులు పాటిస్తుండడంతో రైతుల్లో ఆందోళన చోటుచేసుకుంది. 5రోజులు నీరు వదలితే ఆ వ్యవధిలోనే రైతులు పంటలకు నీరు అందించుకోవాల్సి వుంటుంది. మండలంలో ఎస్సార్బీసీ కాల్వ పరిధిలో వరి 2295 హెక్టార్లు, జొన్న 480, శనగ 1800, మిరప 500, ప్రొద్దుతిరుగుడు 20, పొగాకు 5 హెక్టార్లలో వేశారని మండల వ్యవసాయాధికారి పవన్‌కుమార్ తెలిపారు. వరి ప్రస్తుతం పొట్టదశలో వుందని ఇప్పుడు నీరు అందించడం అవశ్యమన్నారు. ఈ దశలో నీరు అందించకుంటే పంట దెబ్బతింటుందన్నారు. ఇతరాలు ఆరుతడి పంటలైనా ఎక్కువరోజులు నీరు అందించకుంటే అవి కూడా దెబ్బతింటాయని, మిరప పంట కూడా పూత, కాయదశలో వుందని అన్నారు. కాల్వనీరు ఎన్నిరోజలు వస్తుందో తెలియని అయోమయ స్థితిలో రైతులు వున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఎస్సార్బీసీ కాల్వకు నీరు రావడంతో రైతులు ఆనందంతో పొలాలను సాగుచేశారు. రైతులు ఎంతో పెట్టుబడి పెట్టి పంటలను సాగుచేశారు. ఈ దశలో ఎస్సార్బీసీ కాల్వ నీరు ఎన్నిరోజులు వస్తుందో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. వ్యవసాయాధికారి, రైతులు ఆలోచన ప్రకారం జనవరి మొదటి వారం వరకు నీరు విడుదల చేయాల్సి వుంటుంది. అయితే అధికారులు డిసెంబర్ 15వ తేదీ వరకే అంటున్నా, మరో 2 వారాలు ఎక్కువగా నీరు విడుదల చేయాలని భావిస్తున్నారు. కాగా గోరుకల్లు రిజర్వాయరులో నీరు తగ్గుతుండడంతో ఈ నీరు ఎన్నిరోజులు వస్తుందో అంచనాకు అందడంలేదు. ముందస్తు చర్యగా అధికారులు 5/3 పద్ధతి పాటిస్తుండడం, కాల్వనీరు నీటి విడుదల కొంతమేరకు తగ్గించి వదలడం చేస్తున్నారు. ఆది, సోమ, మంగళవారాలు కాల్వలకు నీరు వదలని అధికారులు బుధవారం నుండి కాల్వలకు నీరు వదిలారు. అయితే నీరు బనగానపల్లెకు చేరి పొలాకు అందడానికి ఒకరోజు సమయం పట్టింది. ఇంక నాలుగు రోజుల్లోనే రైతులు పంటలకు నీరు అందించుకోవలసి వుంటుంది. ఈలోపు ముందున్న పొలాల పంటలను దాటుకుని ఆయకట్టు చివరి భూములకు నీరు చేరవలసి వుంది. రైతులు కట్టలు వేసుకుని పంటలకు నీరు అందించుకుంటున్నారు. చివరి భూములకు నీరు వెళ్లడం అంతసులువుగా లేదు.

దేవాలయాల పరిరక్షణ అందరి బాధ్యత

* డిప్యూటీ డైరెక్టర్ వైవి సత్యభాస్కర్

మహానంది, నవంబర్ 15: దేవాలయాలకు వచ్చే భక్తుల పట్ల సఖ్యతగా ఉంటూ దేవాలయాల ఆస్తులను పరిరక్షించడమే సిబ్బంది ప్రధాన లక్ష్యమని స్టేట్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటి డైరెక్టర్ (సీతా) వైవి సత్యభాస్కర్ తెలిపారు. గురువారం మహానంది క్షేత్రంలోని టీటీడీ కల్యాణ మండలంలో జిల్లా స్థాయి దేవాదాయ శాఖ అధికారులు, కార్యనిర్వహణ శాఖ అధికారులకు, ఈఓలకు ఒక్కరోజు శిక్షణా తరగతులను రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈఓ సుబ్రమణ్యం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అన్ని తరగతుల అధికారులకు వారి వారి విధులను, వారు నిర్వహించాల్సిన బాధ్యతలపై శిక్షణ ఇచ్చారు. దేవాలయానికి భక్తులే ప్రధానమని వారి పట్ల సాదరంగా సానుకూలంగా ఉంటూ సేవలు అందించాలన్నారు. దేవాలయ ఆస్తులు పరిరక్షణకు ప్రతి ఒక్క అధికారి బాధ్యత వహించాలన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయ ఆస్తులకు రక్షణ కలిస్తూ వాటి నుండి వచ్చే నిధులు సక్రమంగా వినియోగించాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. 1957 చట్టం ప్రకారం 20 రకాల నిబంధనలు దేవాదాయ శాఖలో ఉన్నాయన్నారు. పరిపూర్ణమైన భక్త్భివంతో విధులు నిర్వహిస్తూ సమస్యలు ఎక్కడా రాకుండ విధులు నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలుగు భాషను బతికిస్తూ అందరు చక్కగా తెలుగులో మాట్లాడాలన్నారు. దేవాలయాల రక్షణ ప్రతి కార్యనిర్వహణ అధికారిపై పూర్తి బాధ్యత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ పవన్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.