కర్నూల్

మురికినీటి శుద్ధికేంద్రం ద్వారా నీటి లభ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, నవంబర్ 15: నగరంలోని వివిధ కాలనీల ద్వార తుంగభద్ర నదిలోకి వెళ్తున్న మురికి నీటిని శుద్ధి కేంద్రం ద్వార నీటి లభ్యతను ఉపయోగించుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ అన్నారు. గురువారం సుంకేసుల రోడ్డులో ఉన్న పాత తుంగభద్ర పంప్ హౌస్ వద్ద ఉన్న ఎస్‌టీపి (సేవియేజ్ టెస్టింగ్ ప్రాజెక్ట్) మురికి నీటి శుద్ధి కేంద్రాన్ని నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కాలనీల ద్వార తుంగభద్ర నదిలోకి వెళ్తుతున్న మురికి నీటిని రెండు చాంబర్ల శుద్ది అయే ప్రక్రియను ఎలా ఉంటుందని కమిషనర్‌ను ప్రశ్నించారు. శుద్ధి చేసిన నీటిని మొక్కల పెంపకం, డివైడర్ల మొక్కలకు, ఇంజనీరింగ్ అభివృద్ధి పనులకు క్యూరింగ్ ప్రక్రియ, పరిశ్రమలకు వాడుకోచ్చన్నారు. అలాగే శుద్ధి చేస్తున్న నీటిని పరీక్ష కేంద్రానికి పంపి ఏ మేరకు నీటిని ఉపయోగించుకోవాలన్న దానిపై ఒక నిర్ధారణకు రావాలన్నారు. ఇలాంటి నీటి శుద్ధి ప్రక్రియ ద్వారా నగరంలో మరింత నీటి లభ్యత అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్‌ఈ సురేంద్రబాబు, ఎంఈ రమణమూర్తి, డీఈలు భాస్కర్ రెడ్డి, రాధాకృష్ణ, ఎంహెచ్‌ఓ డా. పుష్పలత, ఏ ఈ హరికృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రమణ, రవి తదితరులు పాల్గొన్నారు.
బైరెడ్డి సిద్దార్థరెడ్డితో కలిసే ప్రసక్తే లేదు..

నందికొట్కూరు, నవంబర్ 15: నందికొట్కూరు నియోజకవర్గంలో మొదటి నుంచి గౌరు వెంకటరెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డి వర్గం మధ్యనే ప్రధాన పోటీ వుంటుందని, ఇకపై కూడా అదే ఆనవాయితీ కొనసాగుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి అన్నారు. తమ రాజకీయ ప్రత్యర్థి కుటుంబం నుంచి వైకాపాలో చేరిన బైరెడ్డి సిద్దార్థరెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని అన్నారు. గురువారం బ్రాహ్మణకొట్కూరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల తాను నియోజకవర్గానికి దూరంగా వున్నానన్నారు. అయితే ఇటీవల నియోజకవర్గంలో తమ వర్గానికి చెందిన వారిపై ఆగడాలు పెరుగడంతో వాటికి అడ్డుకట్ట వేసి పార్టీ పటిష్టత కోసం మళ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. ఈమేరకు ఈనెల 19వ తేదీన తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలు, సన్నిహితులతో బ్రాహ్మణకొట్కూరులో సమావేశం ఏర్పాటు చేసి, వారి సూచన మేరకు నడుచుకుంటామన్నారు. కొందరు నాయకులు జగన్మోహన్‌రెడ్డిని తప్పుదారి పట్టించి సిద్దార్థరెడ్డిని పార్టీలో చేర్చారన్నారు. 19న జరిగే కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే ఐజయ్య, నంద్యాల పార్లమెంట్ ఇన్‌చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ కస్వ శంకరరెడ్డి, వైసీపీ నాయకులు పలుచాని జనార్ధనరెడ్డి, పోతులపాడు శివానందరెడ్డి పాల్గొన్నారు.