కర్నూల్

నందికొట్కూరు వైసీపీలో ముసలం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడుతూరు, నవంబర్ 15: ఎన్నికలు సమీపించనున్న తరుణంలో నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి ముందుగానే రగిలింది. నియోజకవర్గంలో మొదటి నుంచి మాజీ మంత్రి బైరెడ్డి శేషశయనారెడ్డి, మాజీ మంత్రి మద్దూరు సుబ్బారెడ్డి వర్గాల మధ్య వర్గ పోరు కొనసాగగా, కాలక్రమేణా బైరెడ్డి కుటుంబం నుంచి బైరెడ్డి రాజశేఖరరెడ్డి, మద్దూరు సుబ్బారెడ్డి వర్గం నుంచి గౌరు వెంకటరెడ్డి మధ్య ఎన్నికల వార్ కొనసాగింది. కాగా పది సంవత్సరాల క్రితం నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ కేటగిరీకి మార్చడంతో బైరెడ్డి, గౌరు వర్గీయులే అభ్యర్థులుగా పోటీకి దిగుతూ వచ్చారు. అప్పటి నుంచి గౌరు వెంకటరెడ్డి పాణ్యం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. గౌరు చరితారెడ్డి అక్కడి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఇంతకాలం గౌరు వెంకటరెడ్డి నందికొట్కూరు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో బైరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన బైరెడ్డి సిద్దార్థరెడ్డి వైసీపీలో చేరి నియోజకవర్గ సమన్వయకర్త స్థానంలో ఎమ్మెల్యే ఐజయ్యతో కలిసి అన్ని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కాగా బైరెడ్డి సిద్దార్థరెడ్డి పార్టీలో చేరినపుడు గానీ, పార్టీ సమన్వయకర్తగా గుర్తింపు తెచ్చుకున్నపుడుగానీ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో వున్న గౌరు వెంకటరెడ్డి ఎలాంటి ప్రకటన చేయకపోయినా గురువారం బ్రాహ్మణకొట్కూరులో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బైరెడ్డి సిద్దార్థరెడ్డితో కలిసి పని చేసే ప్రసక్తే లేదని, నియోజకవర్గంలో మళ్లీ తన ప్రధాన అనుచరులు, కార్యకర్తలతో కలిసి పనిచేసి పార్టీ ప్రతిష్టత కోసం కృషి చేస్తానని ప్రకటించడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. తాను కొన్ని అనివార్య కారణాలతో నందికొట్కూరుకు నియోజకవర్గానికి దూరంగా వున్నా కార్యకర్తలకు అందుబాటులోనే వున్నానని, తన వర్గం ఎన్నడూ తనను కాదని పక్కకు వెళ్లదని గౌరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు బైరెడ్డి సిద్దార్థరెడ్డితో పాటు అశేష జనవాహిని మధ్య తిరుగుతున్న ఎమ్మెల్యే ఐజయ్యనే ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు గౌరు ప్రకటించడం విశేషం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు నియోజకవర్గ వైసీపీలో రెండు వర్గాలు తెరపైకి రావడంతో నాయకులు, కార్యకర్తలు ఎటువైపు వెళ్తారనేదానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన ఎమ్మెల్యే ఐజయ్య ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు ఒక్కడే కొనసాగించగా, నేడు ఏ వర్గం వైపు అడుగులు వేస్తాడనేది కూడా చర్చనీయాంశమైంది. తన రాజకీయ భవిష్యత్ కోసం రాజకీయ ప్రవేశం చేసిన బైరెడ్డి సిద్దార్థరెడ్డి రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించుకుని పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి దృష్టిలో వుండేందుకు బైరెడ్డి సిద్దార్థరెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థి కుటుంబం నుంచి వచ్చిన బైరెడ్డి సిద్దార్థరెడ్డికి సహకరించేది లేదని గౌరు వెంకటరెడ్డి అంటుండగా, ఇరువురూ ఒకే పార్టీలో కొనసాగుతారా.. పార్టీ అధిష్టానం ఇరువురితో చర్చలు జరిపి రాజీ కుదుర్చుతుందా.. లేకుంటే ఇకపై జరిగే పరిణామాలేమిటీ అనే అంశాలపై నందికొట్కూరు నియోజకవర్గ రాజకీయ వాతావరణం చలికాలం ఆరంభంలో వేడి పుటిస్తోంది... వైసీపీలో జరిగే పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం.