కర్నూల్

రాళ్ల మయంగా మారిన హంద్రీనదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, నవంబర్ 16: హంద్రీ నదిలోని ఇసుకను ట్రాక్టర్లతో తరలించడంతో హంద్రీ నదిలో ఎక్కడ చూసిన కంకర రాళ్లు దర్శనమిస్తున్నాయి. మండల పరిధిలోని దూపాడు, లక్ష్మీపురం, పెద్దటేకూరు, బస్తిపాడు, అశ్వత్తాపురం తదితర ప్రాంతాలలో హంద్రీ నదిలోని ఇసుకను తరలించడంతో హంద్రీ నదిలో ఎక్కడ పడితే అక్కడ కంకర, రాళ్లు తేలిపోయాయి. హంద్రీ నదిలో ఇసుకను తరలించడంతో నీరు అడుగంటిపోయి రోజు రోజుకు నీరు తగ్గిపోతుంది. ఇప్పటికే పలు గ్రామాలకు, వ్యవసాయానికి అందించే బోరుబావులలో నీరు ఇంకిపోయి నీటి సమస్య ఏర్పడింది. ఈయేడాది వర్షాలు సరిగా కురవక పోంవడంతో వర్షాధార పంటలు ఇప్పడికే పూర్తిగా ఎండిపోగా కాస్తోకూస్తో బోరుబావుల కింద పంటలు పండిస్తున్నారు రైతులు. హంద్రీ నదిలో నీరు తగ్గడంతో బోర్లలో నీటి శాతం లేక రైతులు నానాకష్టాలు పడుతున్నారు. హంద్రీ నదిలో ఎక్కడ ఇసుకను తరలించేందుకు అనుమతులు లేవు అయితే కొంత మంది అధికారుల కళ్లుకప్పి హంద్రీ నదిలోని ఇసుకను రాత్రి వేళ్లలో తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి హంద్రీనదిలో ఇసుకను తరలించకుండ చూడాల్సిన అవసరం ఎంతైన ఉందని పలువురు కోరుతున్నారు.

అర్థాకలితో వెనుదిరిగిన విద్యార్థులు!

చాగలమర్రి, నవంబర్ 16: అర్థాకలితో విద్యార్థులు వెనుదిరిగిన సంఘటన మండలంలోని పెద్దబోధనం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జరిగింది. గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్లిన మండల నోడల్ అధికారి చంద్రవౌలిరెడ్డి పిల్లలు అన్నం ఖాళీ ప్లేట్లతో వెనక్కి వస్తున్న దృశ్యాన్ని చూసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు కడుపు నిండా అన్నం ఎందుకు పెట్టడం లేదని నిర్వాహకులను ఆయన నిలదీశారు. విద్యార్థుల సంఖ్యను బట్టి మధ్యాహ్న భోజనాన్ని వండాల్సిన అవసరం లేదా అని ఆయన తెలిపారు. నిర్వాహకులపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న ఎంఈఓ అనురాధను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణమ్మ, గ్రామ ప్రత్యేక అధికారి పుల్లయ్య, ఈఓఆర్‌డీ సుబ్బారెడ్డి, ఏఈలు కొండారెడ్డి, సత్యనారాయణమూర్తి, శిద్దారెడ్డి, గ్రామ కార్యదర్శి చిన్నబ్బీ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ దస్తగిరమ్మ తదితరులు ఉన్నారు.