కర్నూల్

అంగన్‌వాడీలకు నాసిరకం పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడుబూరు, నవంబర్ 17: బాలింతలు, గర్భిణులకు అందించేందుకు అంగన్‌వాడీలకు ప్రభుత్వం సరఫరా చేసే పాలల్లో నాణ్యత లోపించడం, పాడయినవి రావడంతో ఒక్కో సెంటర్ నుంచి పదుల లీటర్లలో కాలువల్లో పారేస్తున్నారు. పెద్దకడుబూరులోని అంగన్‌వాడీ నెంబర్-3లో ఇలా పాడయిన పాలను శనివారం కాలువలో పారబోశారు. పెద్దకడుబూరు మండలంలోని అంగన్‌వాడీలకు విజయ వజ్రా పాలు సరఫరా అవుతున్నాయి. మండలంలోని చిన్నతుంబళం, పెద్దకడుబూరు సెక్టార్ల కింద 54 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 872 మంది బాలింతలు, 1078 మంది గర్భిణులు ప్రతి రోజు కేంద్రాల ద్వారా పౌష్టికాహారంలో భాగంగా పాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కరికి 200 మిల్లీలీటర్ల పాలు అందజేస్తున్నారు. అయితే విజయ వజ్రా పాలు సరఫరా చేసే ఏజెన్సీ నెలకోసారి స్టాకు మొత్తం అప్పగించి వెల్లడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు వాటిని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. నెల స్టాకు ఒకేసారి ఇచ్చి వెళ్లడంతో పాలు ఎక్కడ చెడిపోతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. వచ్చిన పాలను వచ్చినట్లు గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్నా మిగతా మరుసటి రోజుకు పాడవుతున్నాయి. దీంతో చేసేది లేక వాటిని కాలువల్లో పారబోస్తున్నారు. గర్భిణులు, బాలింతల సంఖ్యను బట్టి 120 నుంచి 200 లీటర్ల పాల ప్యాకెట్లను ఏజెన్సీలు అంగన్‌వాడీ కేంద్రాలకు అప్పగిస్తున్నాయి. పాలన్నీ ఒకేసారి ఇస్తుండంతో వాటిని నిల్వ చేసే సౌకర్యం లేక అలాగే ఉంచడంతో మరుసటి రోజుకల్లా అవి పాడవుతున్నాయి. దీంతో వాటిని కాలువల్లో పారబోస్తున్నారు. ఈవిషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని నిర్వాహకులు అంటున్నారు. ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని బాలింతలు, గర్భిణులకు అవసరమైనంత మేరకు రోజూ పాలు సరఫరా చేయాలని కోరుతున్నారు.