కర్నూల్

నత్తనడకన మండిగిరి నీటి పథం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని,నవంబర్ 17: ఆదోనిలో కలిసిపోయిన మండిగిరి, సాదాపురం పంచాయతీల్లో నివసించే ప్రజల కోసం నాలుగున్నర సంవత్సరాల క్రితం మండిగిరి నీటి పథకానికి శంఖుస్థాపన చేశారు. శంఖుస్థాపన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు నీటి పథకం నత్తనడకన సాగుతుంది. పైళ్లు దాటి పనులు ఆరంభం అయినా నిర్మాణం పనులు మాత్రం నత్తనడక కొనసాగడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నీటి పథకం కావాల్సిన భూసేకరణ జరిగి పనులు ప్రారంభమైన నిర్మాణాలు మాత్రం పూర్తి కాలేదు. మరోవైపుప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం సాదాపురం గ్రామ ప్రజలు గ్రామీణ తాగునీటి విభాగం డీఈని కలిసి తాగునీటి సమస్యను తీర్చాలని కోరుతూ వినతి పత్రం అందించారు. మండిగిరి నీటి పథకం వల్ల సాదాపురం, మండిగిరి, దిబ్బనకల్లు, గోనబావి గ్రామాలతోపాటు మరో నాలుగైదు గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరా అవుతుంది. ఈగ్రామాల ప్రజలకు ఇప్పటి వరకు బోరు నీరే శరణ్యం. మండిగిరి నీటి పథకం గురించి ఏ నేత కూడా పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు పర్శంటేజీలపైన ఉన్న ద్యాస నీటి పథకం పూర్తి చేయడంపై చర్యలు తీసుకోవడంలో చొరవ చూపడం లేదు. 2013, మార్చి 23వ తేదీన మండిగిరి నీటి పథకానికి ఆ నాటి రైల్వే మంత్రి కోట్ల జయసూర్యప్రకాషరెడ్డి మండిగిరి వద్ద శంఖుస్థాపన చేశారు. రూ.6కోట్లతో చేపట్టే నీటి పథకానికి నిధులు కూడా మంజూరు చేస్తున్నట్లు ఆయన సభలోనే ప్రకటించారు. మండిగిరి నీటి పథకం నిర్మాణం జరిగేతే మండిగిరితోపాటు సాదాపురం, దిబ్బనకల్లు, గోనబావి విరుపాపురం ప్రజలకు కూడా నీటి సౌకర్యం కలుగుతుందని ప్రజలు ఎంతో ఆశించారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమిచెంది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర దాటినా ఇంతవరకు ఈ పథకం పూర్తి కాలేదు. కాని నాయకులు వేసిన శిలాఫలకం నేతల నిర్లక్ష్యానికి దిష్టిబొమ్మల మండిగిరి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉంది. నేతల నిర్లక్ష్యాన్ని శిలాఫలకం వెక్కిరిస్తోంది. ఇప్పటివరకు కూడా ఈ పథకం పూర్తి చేయకపోవడంపై ప్రజల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పథకాన్ని నానాతపల్లి గ్రామం వద్ద భూమిని సేకరించి నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. కాని నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. మండిగిరి నీటి పథకం గురించి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను విచారించగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈవిధంగా మండిగిరి తాగునీటి పథకం పూర్తికాకుండా ఉండిపోవడం వల్ల ట్రాక్టర్లతో నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉంది. కాని నిర్మాణ వ్యయం మాత్రం పెరిగింది. ఇంకా తాగునీటి పథకం నిర్మాణం కాలేదు.
ఆప్రాంతాల్లో నివసించే ప్రజలు తాగునీటి పథకం పూర్తి చేయాలని కోరుతూ ఆందోళన కూడా చేశారు. మండిగిరిలో వర్షకాంలో కూడా నీరు లేకపోవడంతో మండిగిరి పంచాయతీ అధికారులు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నారు. ఇది చాలా కాలం నుంచి కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే విరుపాపురం, దిబ్బనకల్, సాదాపురం గ్రామాల్లో ప్రజలు అయితే తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ఉన్న ట్యాంకు వద్దకు వచ్చి నీటిని నింపుకుని వెళ్తున్నారు. డాణాపురం, నానాపురం, కాత్రికి, కమ్మరచేడు ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం చాలా ఆవస్థలు పడుతున్నారు. డాణాపురం వద్ద ట్యాంకు వద్దకు ఎద్దుల బండ్ల మీద, సైకిళ్లపై, మోటాల్ సైకిల్‌పై నీటిని తీసుకెళ్తున్నారు. డాణాపురం గ్రామంలో అయితే నీటి ఇబ్బందులు తట్టుకోలేక ఆగ్రామ ప్రజలు గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున ఇటీవల ముట్టడించారు. చివరకు ఆఫీసు కార్యాలయంపై దాడికి యత్నించారు. దీంతో ఆ గ్రామ ప్రజల మీద కేసు కూడా నమోదు చేశారు. ఈవిధంగా నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాని మండిగిరి నీటి పథకం ఇంక నత్తనకడలోనే ఉంది. రాజకీయ నాయకులు నీటి ఇబ్బందుల గురించి పట్టించుకోలేదు. మండిగిరి నీటి పథకం ప్రారంభం కాకముందే నిర్మాణ వ్యయం మూడింతలైంది. అయినా అధికారులకు, ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేదు. ప్రజలు గ్రామాల్లో వారం రోజులకు ఒక్కసారి తాగునీటి సరఫరా వల్ల ప్రజలు నానా ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకుని కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెచ్చి మండిగిరి నీటి పథకం పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల దాహార్తిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. కలెక్టర్ నీటి పథకాన్ని వెంటనే పూర్తి చేయడానికి తాగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.