కర్నూల్

మహానందీశ్వరుని సన్నిధిలో ఏసీబీ జేడీ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, నవంబర్ 17: మహానందిలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ శరత్‌కుమార్ పూజలు నిర్వహించారు. శనివారం క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ మర్యాదలతో ఈఓ సుబ్రమణ్యం స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లకు అభిషేకార్చన పూజలు నిర్వహించారు. వేదపండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించగా అధికారులు శేషవస్త్రంతో సత్కరించి మెమొంటో అందించారు.

బిస్కెట్ ఫ్యాక్టరీలో విజిలెన్స్ తనిఖీలు
మహానంది, నవంబర్ 17: మండలంలోని లక్ష్మీగణపతి బిస్కెట్ ఫ్యాక్టరీలో ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. శనివారం విజిలెన్స్ సీఐ జీవన్ గంగానాధ్‌బాబు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రవిశంకర్, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటరమణలతో కూడిన బృందం చేసిన సాధారణ తనిఖీల్లో భాగంగా బిస్కెట్‌ల నాణ్యత, వాటికి వాడే ముడిపదార్థాల వివరాలు సేకరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామంలో ఒక ఫ్యాక్టరీని నడుపుతూ వంద మందికి జీవనోపాధి కల్పిస్తున్న ఈ ఫ్యాక్టరీపై జిల్లా విజిలెన్స్ ఎస్పీ బాబురావు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టామని, బిస్కెట్ పదార్థాల నమూనాలు సేకరించి హైదరాబాదు ఫుడ్ ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు. ల్యాబ్ నుండి నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని వారు తెలిపారు.

గజ తుఫాన్‌తో నేలరాలిన పత్తి కాయలు
* ఆందోళనలో రైతులు
ఉయ్యాలవాడ, నవంబర్ 17: ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తిపంట వర్షాలు కురవకపోయినా పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడి వాగులు, వంకలు, కుందరవాగులో ప్రవహిస్తున్న నీటితో పంట పొలాలకు తరలించుకుని కాపాడుకున్నారు. మూడు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం సాయంత్రం మండలంలొ ఒక మోసరు వర్షం కురిసింది. గత రెండు నెలలుగా సీడుపత్తిలో క్రాసింగ్ చేస్తున్న కూలీలు చేసిన శ్రమ, చెట్టుకు వున్న కాయలు నేలరాలిపోవడంతో అన్నదాత కుదేలయ్యాడు. పంటను సాగు చేసేందుకు కౌలు రైతులు ముందస్తు కౌలు ఎకరాకు రూ. 30 వేల నుండి రూ. 35 వేల వరకు చెల్లించి పంటలు సాగు చేశారు. పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 1.20 లక్షలు ఖర్చు చేశామని రైతులు తెలుపుతున్నారు. వర్షం కురవకపోయినా కాసె్తైనా పంట బాగా వుందన్న సంతోషంతో రైతులు వుండగా, గజ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షం రైతన్నకు కన్నీళ్లే మిగిల్చాయి. దాదాపు మండలంలో 1000 ఎకరాల్లో సీడుపత్తి పంటలో నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొంటున్నారు. నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.