కర్నూల్

ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో రూ.3కోట్లతో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 17: ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో రూ.3కోట్లతో డ్రైనేజీ, సీసీరోడ్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. శనివారం స్థానిక 2వ బెటాలియన్‌లో రూ.2కోట్లతో భూగర్భ మురుగు కాలువకు, రూ.కోటితో సీసీరోడ్లు, ఇతర అభివృద్ది పనులకు భూమి పూజ నిర్వహించారు. ఏపీఎస్పీ డీఐజీ విజయకుమార్, కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్రకుమార్, కమాండెంట్లు హుశేన్‌సాహెబ్, షేక్షావలిలు పాల్గొన్నారు. ఈసందర్భంగా డీప్యూటీ సీఎం కేఈ మాట్లాడుతూ ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో దీర్ఘ కాలికంగా డ్రైనేజి సమస్య వుందని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సాధారణ నిధులు, స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజి నిధుల నుండి రూ.2కోట్లు, సీసీ రోడ్లకు రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు వివరించారు. 2వ బెటాలియన్ ఎల్లప్పుడూ గ్రీనరీతో అన్ని సమయాల్లో స్వచ్ఛ కర్నూలుకు శ్రీకారం చుడుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, వరదల సమయంలో 2వ బెటాలియన్ సిబ్బంది సహాయం అనేక సందర్భాల్లో వినియోగించుకున్నామన్నారు. అభివృద్ధిలో ఎస్‌ఏపీ క్యాంపుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎంపీ బుట్టారేణుక మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏపీఎస్పీ డీఐజీ కోరిన విధంగా 10 కంప్యూటర్లను ఎంపీ నిధుల నుండి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్‌ఏపీ క్యాంపు డ్రైనేజి, సీసీ రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఏపీ క్యాంపు కనీస సదుపాయాల ఇబ్బందిని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆమోదం పొందామన్నారు. సీఎం చంద్రబాబు నగరాభివృద్ధికి ఇతోధికంగా నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ గ్రాంటు కింద రూ.100 కోట్లు, క్రిటికల్ ఇన్‌ఫ్రాక్చర్ కింద రూ.230 కోట్లు, నగర సుందరీకరణకు రూ.45 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.19 కోట్లు మంజూరు చేశారన్నారు. నగరంలో శాశ్వత మంచినీటి పరిష్కారానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. అనంతరం కమాండెంట్‌లు ముఖ్య అతిథులను సన్మానించారు.