కర్నూల్

తాగునీటి సమస్య అధిగమించేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, నవంబర్ 17: జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యను అధిగమించేందుకు కృషి చేద్దామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం జడ్పీ సమావేశ భవన్ నందు జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా కేఈ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఏడాది 53 శాతం వర్షపాతం తక్కువగా ఉందని, ఉన్న నీటి వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాల్సిందేనని అన్నారు. జిల్లాలో 51 కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని, ఈ కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.640కోట్ల అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడం జరిగిందన్నారు. వెనకబడిన తరగతులు, మైనార్టీల సంక్షేమానికి కార్పొరేషన్ల ద్వారా రుణాలను ఇప్పించేందుకు కలెక్టర్ బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహిస్తారన్నారు. రూ.192 కోట్ల అంచనాలతో గోరకల్లు రిజర్వాయర్ నుంచి గ్రావీటి ద్వారా బేతంచెర్లకు నీటిని అందించేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ నీటి ఎద్దడిని అధికమించేందుకు హంద్రినీవా ద్వార 118 కి.మీ వద్ద నుండి గాజులదినె్న ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇందుకు రూ.5కోట్లను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం రూ.3కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులు పూర్తి అయిన వెంటనే కె.నాగులాపురం చెరువుకు నీటిని ఇస్తామన్నారు. అలాగే సి.బెళగల్ చెరువుకు త్వరలో పైప్‌లైన్ వేసి నీటిని అందిస్తామని, ఎల్లెల్సీ కింద పంటలు దెబ్బతినకుండా అందరికీ సమానంగా వారబంది అమలు చేస్తామన్నారు. కేసీకెనాల్ కింద పంటలు సాగు చేసిన రైతులు నష్టపోకుండా చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తామన్నారు. అక్రమ నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లాలో దాదాపు 360 పాఠశాలలకు ప్రహరీల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ 2018-19 కు సంబంధించిన ఆదాయ, వ్యయాలను దృష్టిలో ఉంచుకొని 2018-19 నకు సవరణ బడ్జెట్ 2019-20 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. 2018-19లో ఆదాయం రూ.469 కోట్లు, వ్యయం 468 కోట్లు కాగా సవరించిన బడ్జెట్ ప్రకారం ఆదాయం రూ.506.326 కోట్లు, వ్యయం రూ.503.435 కోట్ల అన్నారు. 2019-20లో అంచనా బడ్జెట్ కింద ఆదాయం రూ.576 కోట్లు కాగా వ్యయం 576.198 కోట్లుగా ప్రతిపాదించగా సభ్యులు ఆమోదించారన్నారు. సీపీడబ్ల్యూ కింద వున్న నీటి పథకాలకు గ్రామ పంచాయితీలకు విద్యత్ సరఫరా నిలిపి వేయరాదని అధికారులకు తెలిపారు. ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ పార్లమెంట్ పరిదిలో వేసవి మొదలు కాక ముందే తాగునీటి సమస్య ఎక్కువ అయిందని, సమీపంలోని చెరువులు, కుంటలను నీటితో నింపి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, వెన్నపూస గోపాల్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీ, బీసీ జనార్థన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డిలు తమ నియోజక వర్గాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.