కర్నూల్

‘పది’లో మంచి ఫలితాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిష్ణగిరి, డిసెంబర్ 6:మండల పరిదిలోని ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ తాహె రా సుల్తానా సూచించారు. డీఈఓ గురువారం మండల పరిధిలోని కం బాలపాడు, క్రిష్ణగిరి మోడల్ స్కూ ళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అలాగే వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని వసతి గృహాల సంరక్షకులను ఆదేశించారు. పాఠశాలల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచి, ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు చదువుకునే విధంగా చూడాలన్నారు. వౌలిక సదుపాయాలు కల్పిండం పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంఈఓ వనజాకుమారి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
రూ. 170 కోట్లతో కుందూ-పెన్నా వరద కాలువ పనులు
* స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్‌కుమార్
చాగలమర్రి, డిసెంబర్ 6: మండలంలోని రాజోలి ఆనకట్ట నుండి కడప జిల్లా పొద్దుటూరు పట్టణానికి తాగునీరు అందించేందుకై కుందూ - పెన్నా వరద కాలువ నిర్మాణానికి ప్రభుత్వం రూ.170 కోట్లను కేటాయించినట్లు గాలేరు నగరి సుజల స్రవంతి -3 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అజయ్‌కుమార్ తెలిపారు. మండలంలోని రాజోలి వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణాలు భూములు కోల్పోయిన రైతుల వివరాలను స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆయన సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలువ నిర్మాణానికి 600 ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. పూర్తిగా భూమి కోల్పోయిన రైతుల పునరావాసానికై ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు పరిహారం కింద ప్రభుత్వం రూ.11 లక్షలను చెల్లిస్తుందని ఆయన తెలిపారు. రాజోలి గ్రామంలో భూ సేకరణ అనంతరం పూర్తి వివరాలను కర్నూలు జాయింట్ కలెక్టర్‌కు నివేదిక ఇస్తామన్నారు. త్వరలో రాజోలి గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేస్తామని, ఏవైన అభ్యంతరాలు ఉంటే రైతులు తెలియజేయవచ్చని ఆయన కోరారు.