కర్నూల్

బాబుతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, డిసెంబర్ 6: త్వరలో జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును, నన్ను మీరందరూ ఆశీర్వదిస్తే రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పనులు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని మార్కెట్‌యార్డు వద్ద గురువారం నియోజకవర్గంలోని ఆరు మండలాల లబ్ధిదారులకు ఆదరణ -2 పనిముట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల నోడల్ అధికారి వెంకటరమణ వర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదరణ పథకాన్ని బీసీలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో 70 శాతం సబ్సిడీతో అలందించిన పనిముట్లు ప్రస్తుతం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో చేతి వృత్తిదారులకు పనిముట్లు అందజేస్తుందన్నారు. ఈ పథకం బీసీలకు ఒక వరం లాంటిదన్నారు. నేరుగా లబ్ధిదారులకు పనిముట్లు అందజేయడం వల్ల వారి కులవృత్తులకు న్యాయం చేస్తూ వారు స్వతహాగా అర్థికాభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. చెంచులకు 100 శాతం సబ్సిడీ కింద గొర్రెలను పంపిణీ చేశారు. చంద్రబాబునాయుడు పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో 3000 మంది లబ్ధిదారులకు గృహాలు నిర్మించి ఇస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టా ఇచ్చి గృహనిర్మాణం చేసి అందజేస్తామన్నారు. వీటిలో అధికారులు కానీ, నాయకులు గానీ ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1100 ఫోన్ చేసి పిర్యాదు చేయాలన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలకు 2975 మంది దరఖాస్తులు చేసుకోగా అందులో 761 మంది మాత్రమే డీడీలు చెల్లించారన్నారు. మిగిలిన వారు కూడా త్వరగా డీడీలు చెల్లించి వస్తువులు కోరుకుంటే వారికి త్వరితగతిన పనిముట్లు అందజేస్తామన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలల్లోని గ్రామాల్లోని ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.