కర్నూల్

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఇస్తెమా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, డిసెంబర్ 10:ప్రపంచ శాంతి కోసం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు అంతర్జాతీయ స్థాయి ‘అలమీ తబ్లీక్ ఇస్తెమా’ నిర్వహించారని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూరు గ్రామ సమీపంలో ఉన్న టోల్ ప్లాజా వద్ద గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఇస్తెమా కార్యక్రమం సోమవారం ముగిసింది. ముగింపు వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తెమా కమిటీ చీఫ్ హజరత్ వౌలానా సాద్ సాబ్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి, రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ కాగినెళ్లి ఫకీరప్పతో కలిసి ఇస్తెమా జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం చినరాజప్ప మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా జిల్లాలో ఇస్తెమా కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచే కాకుండా సుమారు 15 దేశాల నుంచి దాదాపు 20 లక్షల మంది ముస్లింలు హాజరయ్యారన్నారు. గతంలో ఔరంగాబాద్, బుందేళ్‌ఖండ్ ప్రాంతాల్లో ఇస్తెమా కార్యక్రమం నిర్వహించారని, కానీ ఇంత పెద్దఎత్తున లక్షలాది మందితో నిర్వహించడం దేశంలోనే మొదటిసారి అన్నారు. ఇలాంటి ఇస్తెమాను నిర్వహించడం వల్ల మత గురువులు చేసిన ప్రార్థన వల్ల రాష్ట్రం ఆధ్యాత్మికంగా విరాజిల్లుతుందన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ శాంతియుతంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లడమే కాకుండా సస్యశ్యామలం అవుతుందన్నారు. సీఎం చంద్రబాబు అన్ని వర్గాలతో పాటు మస్లింల అభివృద్ది కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు.