కర్నూల్

సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 10:సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేసి పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14,15 తేదీల్లో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించే అవకాశం వుందన్నారు. మొదటి రోజున కొలిమిగుండ్ల, కోసిగి మండలాల్లో, మరుసటి రోజున జిల్లా కేంద్రంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయన్నారు. కొలిమిగుండ్ల, కోసిగి మండలాల్లో హెలిప్యాడ్, బారీకేడింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్యాయ్‌లో డాక్టర్ల బృందంతో అంబులెన్స్‌లు సిద్ధంగా వుంచుకోవాలని డీఎంహెచ్‌ఓ డా. ప్రసాద్‌ను ఆదేశించారు. నిర్ధేశించిన విధులను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామదర్శిరని కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.