కర్నూల్

గ్రామాల్లో అభివృద్ధి చేశా.. మరోసారి గెలిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలిమిగుండ్ల, డిసెంబర్ 11: తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండ అన్ని గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, రానున్న ఎన్నికల్లో ఆదరించి మరోసారి తనను గెలిపించాలని ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. మండలంలోని చింతలాయపల్లె గ్రామంలో మంగళవారం రూ.కోటితో పూర్తయిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అలాగే సొంత నిధులతో రూ.12 లక్షలతో పూర్తయిన శుద్ధజల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా న్ని తాను ఎమ్మెల్యే అయిన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని, గ్రామానికి పెన్షన్లు, ఎన్‌టీఆర్ ఇళ్లు, సీఎం సహాయనిధి పథకాలు వర్తింపచేయడం జరిగిందని, వీటి వలన అనేక మందికి అన్ని విధాలుగా లబ్ధి చేకూరిందన్నారు. అలాగే రామ్‌కో సిమెంటు ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపక్ష నాయకులు పార్టీలు మారడం తప్ప అభివృద్ధి చేసింది లేదని, అయితే తాను చేసిన అభివృద్ధిపై వారు మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తాను చేసిన అభివృద్ధిని గుర్తించి రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని ఎమ్మెల్యే బీసీ ప్రజలను కోరారు.
అందని కేసీ నీరు..!
* ఆందోళనలో ఆయకట్టు రైతులు
చాగలమర్రి, డిసెంబర్ 11: స్థానిక కూలూరు రస్తాలోని మల్లెవేముల తూము ద్వారా వరి పంట పొలాలకు కేసీ ప్రధాన కాల్వ ద్వారా పంట కాల్వలకు సాగునీరు అందకపోవడంతో చాగలమర్రికి చెందిన ఆయకట్టు రైతు లు మంగళవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాబూషరీఫ్, జయన్న, శ్రీకాంతరెడ్డి, షేక్ మాబూషరీఫ్, సంజీవ తదితరులు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుం డి పంట కాల్వలకు నీరు తగ్గించడంతో వరి పంట పొలాలకు నీరు అందడం లేదన్నారు. దీంతో గింజ దశలో ఉన్న వరి పంటకు సరైన సమయంలో నీరు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 30 వేలకు పైగా ఖర్చు పెట్టామని, పంట చేతికి అందే సమయంలో సాగునీరు అందించకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట పండే వరకు కేసీ ప్రధాన కాల్వ ద్వారా సాగునీరు అందిస్తామని కేసీ కాలువ అధికారులు హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ ప్రకారం నీరు ఎందుకు ఇవ్వలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఈని కింద 200 ఎకరాల వరకు ఆయకట్టు పొలం ఉందని వారు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి కేసీ ప్రధాన కాల్వ ద్వారా పంట కాల్వలకు నీరు విడుదల చేసి ఆదుకోవాలన్నారు. ప్రస్తుతం పంట కాలువల్లో నీరు నిలిచి పోయి ప్రవహించడమేలేదన్నారు.
ఓటర్ల జాబితాను
పకడ్బందీగా రూపొందించాలి
* భారత ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్లు సక్సేనా, శుక్లా
కర్నూలు, డిసెంబర్ 11:ఓటర్ల జాబితాలో అనుమానిత ఓటర్లు, నకిలీ ఓట ర్లు లేకుండా స్పష్టమైన ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందించాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్లు సక్సేనా, శుక్లా ఏపీ ఎన్నికల సంఘం సీఈఓ, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలోని నిర్వాసిత్ సదన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో స్పష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ల జా బితాలో అనుమానిత ఓటర్లు, నకిలీ ఓటర్లు అత్యధికంగా వున్న నేపథ్యం లో సంబంధిత పోలింగ్ బూత్ అధికారులు ఇంటింటికీ తిరిగి క్షుణ్ణంగా పరిశీలించి జాబితాలో సరి చేయాలన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా తుది ఓటర్ల జాబితా ప్రచురించరాదని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఏపీలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా అనుమానిత ఓట్లు, నకిలీ ఓట్లు ఉన్నాయని జాబితాలోని అనుమానిత ఓట్లను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. తప్పు ఒప్పులు లేని ఓటరర్ల జాబితా రూపకల్పనకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లాల ఎన్నికల అధికారులు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
కారు జోరుకు సైకిల్ పంచర్..
చేతికి ఫ్యాక్చర్
* విషకూటమిని ప్రజలు నమ్మరు * దిగజారుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట
* కర్నూలు పార్లమెంట్ వైసీపీ అధ్యక్షుడు బీవై రామయ్య
కర్నూలు సిటీ, డిసెంబర్ 11:తెలంగాణ ఎన్నికల్లో కారు జోరుకు సైకిల్‌కు పంచర్ కాగా చేతికి ఫ్యాక్చర్ అయితే కమలం పూర్తిగా వాడిపోయిందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అధ్యక్షుడు బీవై రామయ్య ఎద్దేవా చేశారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉందని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేయడంలో దిట్ట అన్నారు. అధికారం కోసం ఎన్ని పార్టీలతోనైనా జతకడతారని, ఇప్పటి వరకూ ఆయన అన్ని రాజకీయ పార్టీలతో జత కట్టారన్నారు. అబద్దాలు, అవినీతి, అరాచకాలు, అప్రజాస్వామ్యపద్ధతిలో ఎలా నెగ్గుకురావాలో తెలిపిన చంద్రబాబు మోసమే తన సిద్ధాంతంగా మార్చుకున్నారని విమర్శించారు. అటువంటి తెలివి తేటలున్న చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలవగానే మేము గెలుస్తామన్న ఊహా లోకంలో విహరిస్తున్న కూటమి సభ్యులను ప్రజలు డిపాజిట్లు దక్కుకుండా చేసి కూటమిని నమ్మమని నిరూపించారన్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి చంద్రబాబు కూటమిని తరిమికొట్టారన్నారు. కుట్రపూరితంగా ఏర్పడిన కాంగ్రెస్, టీడీపీ విషకూటమికి ప్రజలు ఓట్టుతో బుద్ధి చెప్పారన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని ఆ కాంగ్రెస్‌కే తాకట్టుపెట్టిన ఘనుడు చంద్రబాబు అన్నారు. నవరత్నాలు రూపొందించి ప్రజలకు చేరువైన నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అని, ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించిన నాయకుడన్నారు. ఏపీలో ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా వైసీపీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ గల్లంతు కావడం ఖాయమన్నారు. కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. ప్రజా సంక్షేమం ప్రజల అజెండాగా ఎన్నికలు జరిగాయని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే కనీసం 35 సీట్లైనా గెలిచేదన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో కూడా పునరావృతమవుతాయని, వైసీపీ ప్రభంజనంలో టీడీపీ కొట్టుకుపోతుందన్నారు.
సీఎం చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటాం
* మధ్యాహ్న భోజన కార్మికుల హెచ్చరిక
కల్లూరు, డిసెంబర్ 11:ఈ నెల 14,15 తేదీల్లో జిల్లా పర్యటనకు వస్తు న్న సీఎం చంద్రబాబు పర్యటనను సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులచే అడ్డుకుంటామని సీఐటీయూ జిల్లా కార్యదర్శులు నిర్మల, నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మండల పరిధిలోని పెద్దపాడు గ్రామంలో రహదారిపై సీఐటీయూ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాళ్లు రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రీకృత వంట శాల లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 15 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తుంటే వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం కేంద్రీకృత వంటశాలలను ప్రవేశపెట్టడం సిగ్గుచేటన్నారు. మహిళల సంక్షేమమే టీడీపీ ధ్యేయం అని చెప్పుకునే సీఎం చంద్రబాబుకు నేడు మధ్యాహ్న భోజన పథకం ఎవరు నిర్వహిస్తున్నా రో తెలియదా అని వారు ప్రశ్నించారు. మహిళల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబును మహిళలు అందరూ ఏకమై అడ్డుకుంటామ ని హెచ్చరించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభు త్వం స్పందించి మధ్యాహ్న భోజన పథకాన్ని పాత పద్ధతిలోనే నిర్వహించాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు, డీఈఓ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కార్మికుల సమస్యలు తెలుసుకుని ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
బాబుతోనే బడుగు,
బలహీన వర్గాల అభివృద్ధి
* ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి
ఎమ్మిగనూరు, డిసెంబర్ 11: రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సీఎం చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల గ్రామానికి చెందిన కటస్త నాయకులు నరసింహులు, బోడెన్న, కర్రన్న, రవి, సురేష్‌బాబుల ఆధ్వర్యంలో సుమారు 100 మంది ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఈసందర్భంగా పార్టీలోకి చేరిన వారికి పార్టీ కండువ కప్పి సాదారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో టీడీపీ చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ పథకాలకు ఆకర్శితులై టీడీపీలోకి పెద్ద ఎత్తున వసలు వస్తున్నారన్నారు. రాబోవు ఎన్నికలల్లో టీడీపీని గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజేంద్ర, యువకులు పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో
వైద్యం అందక మహిళ మృతి!
* ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన
ఆదోనిటౌన్, డిసెంబర్ 11: మండల పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన శివమ్మ(35)కు సకాలంలో వైద్యం అందక ఏరియా ఆసుపత్రిలోనే మృతి చెందిందని మృతురాలి భర్త, డీవైఎఫ్‌ఐ నాయకులు తాహేర్, వీరేష్, తిరుమలేష్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శ్రీను, నాగరాజు ఆరోపించారు. మంగళవారం ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులతో కలసి నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, నాయకులు మాట్లాడుతూ పెద్దహరివాణంకు చెందిన శివమ్మ ఊపీరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండగా ఆమెను ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చామని, అక్కడ ఉన్న సిబ్బంది వైద్యులు భోజనానికి వెళ్లారని వచ్చిన తరువాత చూస్తారని చెప్పారన్నారు. వైద్యులకు ఫోన్ చేసి పిలువాలని చెప్పిన సిబ్బంది పట్టించుకోలేదన్నారు. తీరా డాక్టర్ వచ్చే సమయానికి ఊపిరి పీల్చుకోలేక రోగి మృతి చెందిందని దీనికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపించారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై, డాక్టర్ చర్యలు తీసుకోవాలని, 100 పడకల ఆసుపత్రి ఉన్నా డాక్టర్లు అందుబాటులో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై జిల్లాయంత్రాంగం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.
ముమ్మరంగా సీఎం పర్యటన ఏర్పాట్లు
* ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికారులు
కోసిగి, డిసెంబర్ 11: కోసిగికి ఈనెల 14వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు రానున్న సందర్భంగా కోసిగిలో శ్రీరేణుక ఎల్లమ్మ అవ్వ దేవాలయం ఆవరణంలో బహిరంగ సభ, చిన్నభూంపల్లి గ్రామంలో గ్రామదర్శిని సభ స్థలం, పులికనుమ రిజర్వాయర్ జలహారతి పనులను కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ రవి సుభాష్, మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి, ఆర్డీఓ రామమూర్తి, తదితరులు పరిశీలించారు. వౌంట్ కార్మెల్ పక్కనే హెలిఫ్యాడ్ ప్రదేశం, పులికనుమ జలాహారతి, తదితర పనులను పరిశీలించారు. చిన్న భూంపల్లి గ్రామంలో పర్యటించి పర్యటించిన కలెక్టర్ ప్రజలతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? మరుగుదొడ్లు నిర్మాణంపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎటువంటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరాముడు, తహశీల్దార్ రజనీకాంత్‌రెడ్డి, సీఐ తబ్రేజ్, ఎస్‌ఐ అశోక్‌కుమార్, ఇరిగేషన్ అధికారులు, అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రథమనందీశ్వరుని
హుండీ ఆదాయం లెక్కింపు
నంద్యాలటౌన్, డిసెంబర్ 11: పట్టణంలోని శ్రీప్రథమనందీశ్వరుని ఆలయ కార్తీక మాస హుండీ ఆదాయం మంగళవారం నిర్వహించిన లెక్కింపులో రూ.3,62,974లు ఆదాయం వచ్చిందని చైర్మన్ మాలేపాటి రాజశేఖర్, ఈఓ నాగప్రసాద్ తెలిపారు. లెక్కింపులో సేవా టెక్కెట్ల ద్వారా రూ.1,91,690లు, హుండీల ద్వారా రూ.1,70,013, తాత్కాలిక దుకాణాల ద్వారా రూ.1271లు వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్, కమిటీ సభ్యులు మనోహర్, మధు, వీరయ్య, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.