కర్నూల్

అంతర్జాతీయ నృత్య పోటీలకు రిషిత ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, డిసెంబర్ 14:పట్టణంలోని మదర్ మోడల్ పాఠశాల విద్యార్థిని రిషిత అంతర్జాతీయ నృత్య పోటీలకు ఎంపికైనట్లు శుక్రవారం పాఠశాల కరెస్పాండెంట్ ముచ్చలపూరి శ్రీనివాసులు, కోఆర్డినేటర్ జయథామస్, ప్రినిపాల్ రాయసం మురళి ఒక ప్రకటనలో తెలిపారు. సనాతన కల్చరల్ ఆర్గనైజేషన్, శ్రీశ్రీ మహాయోగినిమాత మణికేశ్వరి సుకాశ్రం ట్రస్టుల ఆధ్వర్యంలో తమిళనాడులోని మధుర నగరంలో మధురమీనాక్షి జాతీయ క్లాసికల్ డాన్స్ ఫెస్టివల్-2018 నిర్వహించారు. ఆ పోటీల్లో పాల్గొన్న మదర్ మోడల్ పాఠశాల విద్యార్థులు పలు విభాగాల్లో ప్రథమ స్థానం సాధించగా స్థానిక పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో క్రీడాకారులు, కళాకారుల గురించి కరెస్పాండెంట్ విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు ఆసక్తి కలిగిన రంగంలో ప్రతిభ చూపాల్సిన అవసరం ఉందన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు ఆసక్తి కలిగిన వారికి క్రీడలు, కళా రంగాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు.
ముస్లింల అభివృద్ధికి
చంద్రబాబు ప్రత్యేక కృషి
* ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు ఓల్డ్‌సిటీ, డిసెంబర్ 14:సీఎం చంద్రబాబు ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. ఇస్తేమాకు సహకరించిన ఎస్వీ మోహన్‌రెడ్డికి శుక్రవారం నగరంలోని ఎస్వీ నివాసంలో ముస్లిం మత పెద్దలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ ఇస్తేమాను ప్రశాంతంగా నిర్వహించుకుని విజయవంతం చేసినందుకు మొదట అల్లాహ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ప్రతి ముస్లిం ఇస్తేమాలో మత గురువులు చెప్పిన సందేశాలను ఆచరించాలన్నారు. తన హయాంలో కర్నూలులో ఇస్తెమా నిర్వహించడం, ఆ పనుల్లో తాను పాలుపంచుకునే భాగ్యం కల్గినందుకు ఆ అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇస్తెమాకు హాజరైన జనాబ్ సాద్ సాబ్‌తో రెండుసార్లు కిలి ముసఫా అవకాశం అల్లాహ్ కృప వల్లే సాధ్యమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తెమా నిర్వహణకు రూ. 10 కోట్లు విడుదల చేసిందన్నారు. అన్ని శాఖల వారు అహర్నిశలు శ్రమించి ఇస్తెమా విజయవంతం చేశారన్నారు. అంతర్జాతీయ ఇస్తెమాను విజయవంతంగా నిర్వహించడంలో ఎస్వీ మోహన్‌రెడ్డి కృషి అనిర్వచనీయమైందని ముస్లింలు కొనియాడారు. ఇస్తెమాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిధులు సమకూర్చాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఏకైక ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.
గిరిజనులను నిర్లక్ష్యం చేస్తే సహించం
* సుగాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌నాయక్
కల్లూరు, డిసెంబర్ 14:గిరిజనులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని సుగాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శంకర్‌నాయక్ హెచ్చరించారు. స్థానిక బీ.క్యాంపులో శుక్రవారం సుగాలి హక్కుల పోరాట సమితి నాయకుడు రమేష్ నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌నాయక్ మాట్లాడుతూ టీడీపీ ఎన్నికలకు ముందు గిరిజనులకు అనేక హామీలు ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయకుండా గిరిజనుల అభివృద్ధికి తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. గిరిజనులపై తరచూ దాడులు జరుగుతుండగా బాధితులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులు చేస్తుండగా పోలీసులు వాటిని పట్టించుకోకుండా గిరిజనులపైనే తిరిగి కేసులు పెట్టించడం దారుణంగా ఉందన్నారు. తండాల్లో తాగునీరు, రహదారులు సక్రమంగా లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సంక్షేమ పథకాలు గిరిజనులకు అందని ద్రాక్షలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ప్రవేశపెట్టారే తప్ప వాటిని అర్హులకు అదించడంలో అనేక షరతులు విధించడంతో సబ్సిడీ రుణాలు అందకుండా పోయాయని వాపోయారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారిని అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గిరిజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.