కర్నూల్

ఎల్‌ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటులో వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 14:జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటులో వెనుకబడడంపై పంచాయతీ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లపై కలెక్టర్ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుపై శుక్రవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 889 గ్రామ పంచాయతీల్లో 1.54 లక్షల ఎల్‌ఈడీ విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ కేవలం 4,450 బల్బులు మాత్రమే అమర్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ బల్బుల ఏర్పాటులో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. 3వ విద్యుత్ లైన్ అవసరమైన ప్రాంతాల్లో సంబంధిత ఈఈ, డీఈలతో ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈని ఫోన్ ద్వారా ఆదేశించారు. పెండింగ్‌లో వున్న ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటును జనవరి 15వ తేదీ లోపు పూర్తి చేయించాలని కలెక్టర్ సంబంధిత డివిజన్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఇక గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ డీపీఓ ప్రభాకర్‌రావును ఆదేశించారు.
క్రీడాకారుడికి హిమాలయ
గురూజీ చేయూత
కర్నూలు ఓల్డ్‌సిటీ, డిసెంబర్ 14:నగర శివారులోని శ్రీహిమాలయ గురూజీ ఆశ్రమంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన మణికంఠకు రూ. 16వేలు విలువ చేసే కిట్‌ను శ్రీహిమాలయ గురూజీ అందజేశారు. ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, మణికంఠ పేద కుటుంబం నుంచి వచ్చి రాష్టస్థ్రాయిలో జరిగే క్రికెట్ పోటీకు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ప్రతిభ ఉన్న ఏ క్రీడాకారుడికైనా శాంతి ఆశ్రమ ట్రస్టు ద్వారా సహాయం అందిస్తామన్నారు. మణికంఠ మరిన్ని విజయాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా ఉషు సంఘం చైర్మన్ గూడూరు గోపాల్‌శెట్టి మాట్లాడుతూ హిమాలయ గురూజీ జిల్లాలో ఎందరో పేద విద్యార్థులకు అన్నదానం, తదితర సేవా కార్యక్రమాలు చేపట్టడం జిల్లా వాసులు చేసుకున్న పుణ్యమన్నారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారు ఎవరైనా తమను సంప్రదిస్తే తగిన సహాయం అందించి ప్రోత్సహిస్తామన్నారు.
స్మార్ట్ సిటీ కాదు.. డర్టీ సిటీ
* సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి
కర్నూలు సిటీ, డిసెంబర్ 14 : కర్నూలు నగరాన్ని ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ కలిసి స్మార్ట్‌సిటీగా చేస్తామని గొప్పలు చెప్పి చివరికి డర్టీ సిటీగా మా ర్చారని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ, వైసీపీ విధానాల్లో ఎలాంటి తేడాలు లేవని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి నూతన ప్రత్యామ్నాయ విధానాల కోసం ముందుకెళ్తున్నాయన్నారు. ఆయన శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్‌లో శుక్రవారం సీపీఐ, జనసేన, లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు 2014 పంద్రాగస్టు వేడుకల్లో జిల్లాకు ఇచ్చిన 32 హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. ముఖ్యంగా సర్వజన ఆసుపత్రిని ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని విస్మరించారన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వామపక్ష పార్టీలు ఉద్యమాలు చేయగా అర్ధరాత్రి నాయకులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా కావాలని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. ప్రత్యేక హోదా, వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక నిధులు రాబట్టడం, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ ఇద్దరూ విఫలం చెందారన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధి అంటే అమరాతి అభివృద్ధి అనుకుంటున్నారని, అమరాతితో పాటు వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధి జరిగినప్పుడే సమగ్రాభివృద్ధి జరిగినట్లు అన్నారు. కర్నూలు నగరాభివృద్ధి, ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల కోసం ఈ నెల 17వ తేదీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.