కర్నూల్

* త్వరలోనే గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, డిసెంబర్ 14:రైల్వే ప్రయాణికుల సౌలభ్యమే తమ ధ్యేయమని, ప్రయాణికుల సంక్షేమం కోసం ఎన్నో పనులు చేపడుతున్నామని గుంతకల్లు రైల్వే డీఆర్‌ఎం విజయ్ ప్రతాప్‌సింగ్ స్పష్టం చేశారు. డీఆర్‌ఎం శుక్రవారం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఇందులో భాగంగా స్టేషన్‌లో ప్లాట్ ఫాంతో పాటు ఎస్‌ఎస్ రూమ్, క్యాంటీన్లు, బుకింగ్ ఆఫీస్, రైల్వే ఆసుపత్రి, స్కూటర్ పార్కింగ్‌లను పరిశీలించారు. డీఆర్‌ఎం తొలుత ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే సంఘం నాయకులు నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గుంటూరు నుంచి గుంతకల్లు వరకూ చేపట్టిన విద్యుదీకరణ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అంతేగాక నంద్యాల నుంచి గుంతకల్లు వరకూ జరుగుతున్న డబ్లింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ప్యాసింజర్ల సౌలభ్యం కోసం ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. డివిజన్ పరిధిలో పనులు నాణ్యతగా చేపడుతున్నామని, విధి నిర్వహణలో ఉద్యోగులు ఎంతో శ్రద్ధతో పని చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల సహకారంతో రైల్వే డివిజన్ అభివృద్ధిలో దూసుకుపోతుందని హర్షం వ్యక్తం చేశారు. డోన్ రైల్వే స్టేషన్‌లో పరిధిలో రూ. 5 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన ఒకటిన్నర సంవత్సంలోనే ఎంతో అబివృద్ధి జరిగిందని తెలిపారు. రైల్వేలోని 6 రంగాల్లో అవార్డులు అందుకున్నామని, ఒక్కో అవార్డుకు రూ. 6 లక్షలు వస్తే సంక్షేమానికి వినియోగించినట్లు తెలిపారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదు వస్తే తక్షణమే పరిష్కారం చేస్తామన్నారు. డోన్ స్టేషన్‌లో కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
పాతపేటలో త్వరలో రైల్వే బ్రిడ్జి నిర్మిస్తాం
డోన్ పట్టణంలోని పాతపేటలో రైల్వే గేట్ల వద్ద అర్ధాంతరంగా ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణం పనులను డీఆర్‌ఎం పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కరనాయుడు, ఓబుళాపురం శేషిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఓంప్రకాష్, మండల అధ్యక్షుడు శ్రీరాములు, మైనార్టీ నాయకులు బాబులాల్, దస్తగిరి, ఖాజాతో పాటు పలువురు డీఆర్‌ఎంకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీఆర్‌ఎం బ్రిడ్జిని పరిశీలించి 15 రోజుల్లో నివేదికను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్!
* సర్కారు ఆదాయానికి గండి..
* పట్టించుకోని అధికారులు..
కల్లూరు, డిసెంబర్ 14:గ్రామీణ ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల్లో కంకర క్వారీ యాజమాన్యాలు పెద్ద పెద్ద యంత్రాలు ఏర్పాటు చేసుకుని అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న విమర్శలు వినపిస్తున్నాయి. మండల పరిధిలోని ఉలిందకొండ, యాపర్లపాడు, చెట్లమల్లాపురం, కొల్లపల్లితండా, తడకనపల్లి, తదితర గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతానికి అనుకుని ఉన్న కొండల్లో కంకర రాళ్లు అధికంగా ఉన్నాయి. దీంతో కొందరు కంకర క్వారీల యాజమాన్యాలు ఆ కొండలకు అనుమతులు తీసుకుని వాటితో పాటు ప్రభుత్వ భూముల్లోని వందల ఎకరాల్లో కంకర మిషన్ల సాయంతో కొండలను పిండి చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లాలోని పలు పట్టణాలకు కంకర సరఫరా చేస్తూ తమ వ్యాపారాన్ని మూడు వువ్వులు.. ఆరు కాయలుగా జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ వారి వైపు కనె్నత్తికూడా చూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా క్వారీలకు సమీపంలోని యాపర్లపాడు, కొల్లంపల్లి, ఉలిందకొండ, ఓబులాపురం, బైరాపురం, తదితర గ్రామాల్లోకి కంకర మిషన్ల ద్వారా ప్రతిరోజూ వెలువడే దుమ్ము పెద్దఎత్తున చేరుతుంది. ఈ దుమ్ము ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు రోగాలకు గురై మృత్యువాత పడుతున్నారు. ఈ విషయమై ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా యంత్రాంగం స్పందించి ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపడుతున్న కంకర మైనింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.