కర్నూల్

మహానందికి చేరిన నంది విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, డిసెంబర్ 14: మహానంది పుణ్యక్షేత్రంలో ఎన్నో ఏళ్లుగా జాప్యమైన పెద్ద రాతి నంది విగ్రహం ఎట్టకేలకు మహానందికి చేరింది. శుక్రవారం ఆలయ అధికారులు మహానంది క్షేత్రానికి చేర్చారు. ముందుగా నంద్యాల పొరిమేర అయిన అయ్యలూరు మెట్ట సర్కిల్ నందు సాంప్రదాయబద్దంగా చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఈఓ సుబ్రహ్మణ్యంచే వేదపండితులు రవిశంకర్ అవధాని, శాంతారామ్‌భట్, హనుమంతు శర్మలు వేదోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వాగతం పలికారు. అనంతరం నంద్యాల పట్టణంలోని నవనందులలో ప్రథమ పూజ్యుడైన ప్రథమనందీశ్వర స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించుకొని సంజీవనగర్, శ్రీనివాసనగర్‌ల మీదుగా మహానంది క్షేత్రానికి చేర్చారు. మహానంది ముందు భాగంలో ఉన్న గరుడ నందీశ్వర స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో పాటు అధికారులు, పాలక మండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నంది సర్కిల్‌కు చేర్చారు. ఈ నంది విగ్రహానికి దారి వెంట ప్రజలు నీరాజనాలు పడుతూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. గుంటూరుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ అలియాస్ నాని దాదాపు రూ.35 లక్షలు వెచ్చించి ఈ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొనే్నళ్లుగా జాప్యం జరుగుతూ వచ్చింది. అధికారుల చొరవతో శుక్రవారం మహానంది క్షేత్రానికి చేరుకొని శనివారం నంది సర్కిల్‌లో కొలువుదీరనున్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు రామకృష్ణ, పత్తి వెంకటసుబ్బయ్య, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, పరశురామ శాస్ర్తీ, ఇన్‌స్పెక్టర్లు నాగమల్లయ్య, సుబ్బారెడ్డి, ఏఈ రాజేంద్రప్రసాద్, స్థపతి సుబ్రమణ్యం, శిల్పి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 13 అడుగుల ఎత్తు, 50 టన్నుల గల రాతి నంది విగ్రహం భక్తులను ఆకట్టుకుంది.
జిల్లాను పారిశ్రామిక హబ్ చేస్తాం
* టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
కొలిమిగుండ్ల, డిసెంబర్ 14 : ఓర్వకల్లులో మెగా సీడ్‌పార్కు, కొలిమిగుండ్లలో సిమెంటు ఫ్యాక్టరీలు, విమానాశ్రయం కలిపి జిల్లాను మొత్తం పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. అలాగే కొలిమిగుండ్లను సిమెంటు హబ్‌గా చేస్తామని, ఓర్వకల్లులో ఫార్మా పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామన్నారు. కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ పరిధిలో రూ. 1500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న రామ్‌కో సిమెంటు పరిశ్రమ ఏర్పాటుకు శుక్రవారం సీఎం చంద్రబాబు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కొలిమిగుండ్లలో ఉత్పత్తి చేసే సిమెంటును వివిధ రాష్ట్రాలకు, ఓడరేవులకు పంపేందుకు సంజామల నుంచి కొలిమిగుండ్ల వరకూ రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు.
పరిశ్రమల ఏర్పాటుతోనే
నిరుద్యోగ సమస్యకు పరిష్కారం
* కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి
కొలిమిగుండ్ల, డిసెంబర్ 14: ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు, నిరుద్యోగ సమస్య తీరాలంటే పరిశ్రమలు ఏర్పాటు కావాలని కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. కొలిమిగుండ్లలోని కల్వటాల గ్రామ పరిధిలో శుక్రవారం రూ.1500 కోట్లతో నిర్మాణం కానున్న రామ్‌కో సిమెంటు పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రముఖులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య తీరాలంటే పరిశ్రమలు ముఖ్యమన్నారు. ఈ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ ఏర్పాటుకు రామ్‌కో వారు ముందుకు వచ్చారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొలిమిగుండ్లను సిమెంటు హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారని, పరిశ్రమల ఏర్పాటుకు తమ భూములు ఇచ్చిన రైతులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కొలిమిగుండ్లలో సిమెంటు పరిశ్రమ నిర్మాణం చారిత్రాత్మక ఘట్టమని, ఈ ప్రాంతంలో మూడు ముఖ్యమైన సిమెంటు పరిశ్రమల ద్వారా రూ.7600 కోట్లతో 6 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. రామ్‌కో సిమెంటు పరిశ్రమ 500 ఎకరాల్లో రూ.1500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారని 50 మెగా వాట్ల క్యాపిటల్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయబోతున్నారని, వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతి పెద్దదైన సోలార్ ప్రాజెక్టు మన కర్నూలులోనే ఉందన్నారు. ఇప్పటి వరకు 23 భారీ పరిశ్రమలు రూ.4600 కోట్లతో స్థాపించి 8 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కొలిమిగుండ్లలో అల్ట్రాటెక్, ప్రిజం, బనగానపల్లె సమీపంలో మహాసిమెంటు పరిశ్రమలు వస్తున్నాయని, రైతులకు సామాజిక పెట్టుబడి కింద రూ.30 కోట్లు రామ్‌కో సిమెంటు వారు జమ చేసి ఉన్నారని వారు అన్నారు.
కొలిమిగుండ్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం
- రామ్‌కో సిమెంటు ఎండీ వెంకటరామరాజు
కొలిమిగుండ్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రామ్‌కో సిమెంటు ఎండీ వెంకటరామ రాజు అన్నారు. శుక్రవారం రామ్‌కో సిమెంటు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వెంకటరామ రాజు సభను ఉద్దేశించి మాట్లాడుతూ కొలిమిగుండ్లలో అతి పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ స్థాపన వలన ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని, ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కొలిమిగుండ్ల మండల రూపు రేఖలే మారిపోతాయని ఆయన అన్నారు. ప్రజలకు తమ వంతు బాధ్యతగా తమ సిమెంటు పరిశ్రమ నుండి జీఎస్‌ఆర్ ఫౌండేషన్ కింద విద్యా, వైద్యం, దత్తత గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, వీధిలైట్లు, ఇతరాత్ర ప్రజల వౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. సమావేశంలో రైతులు దామోదర, దశరథరామిరెడ్డిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి చొరవతో సిమెంటు పరిశ్రమ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో తమకు అదనపు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డికి, కలెక్టర్ సత్యనారాయణకు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, సిమెంటు పరిశ్రమ ఎండీ వెంకటరామరాజు తదితరులకు రైతులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ప్రయాణికుల సౌలభ్యమే ధ్యేయం