కర్నూల్

నేటి నుంచి అహోబిలంలో మహాయజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, డిసెంబర్ 15 : పుణ్యక్షేత్రమైన అహోబిలంలో నేటి నుండి 25వ తేదీ వరకు జ్వాలా ట్రస్టు అధినేత శ్రీ్ధర్ గురూజీ ఆధ్వర్యంలో శ్రీ మహా సుదర్శన, మహా నృసింహ సంపుటిత శ్రీ అమృత నారాయణ ప్రయోగ మహా యజ్ఞం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యజ్ఞం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. 16నుండి 19వ తేదీ వరకు యాగశాల శుద్ధి, కలశస్థాపన, యాగశాల యంత్ర, మంత్ర, యంత్ర ప్రతిష్ఠ, దంపతీపూజ, వటుకపూజ, కన్యాపూజ కార్యక్రమాలుంటాయన్నారు. 20న అగ్నిముఖం, ప్రథమ పూర్ణాహుతి, 21న ద్వితీయ పూర్ణాహుతి, 22న మహాపూర్ణాహుతి, 23, 24న కమల పాదుకా ఆరాధన, 25న సహస్ర కళశాభిషేకం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం జరగుతుందన్నారు. ఈ యాగానికి సుదూర ప్రాంతాల నుండి రుత్వికులు హాజరై హోమాలు నిర్వహిస్తారన్నారు.
వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
* అదనంగా రూ. 10లక్షల బీమా ప్రకటించాలి * వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేష్
కర్నూలు సిటీ, డిసెంబర్ 15:ప్రస్తుతం ఉన్న ఫెడరేషన్‌ను రద్దు చేసి ప్రత్యేకంగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేష్ డిమాండ్ చేశారు. నగరంలోని వౌర్యి ఇన్ హోటల్‌లో శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఫెడరేషన్‌ను రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 500 కోట్లు కేటాయించాలన్నారు. అలాగే వడ్డెర కార్మికులు ఎక్కువగా భవన నిర్మాణాల్లో పని చేస్తుంటారని వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బీమా కింద అందజేస్తున్న రూ. 5లక్షల బీమా కాకుండా అదనంగా రూ. 10 లక్షలతో ప్రత్యేక బీమా సౌకర్యం కల్పించాలన్నారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి నిధులు కేటాయించాలన్నారు. 50 సంవత్సరాల వయస్సు కలిగిన వడ్డెర్లకు నెలకు రూ. 3వేల పింఛను ఇవ్వాలన్నారు. జిల్లాలో 2.3 లక్షల జనాభా కలిగిన వడ్డెర్లకు ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ నెల 30వ తేదీ రాజమండ్రిలో నిర్వహించే జయహో బిసీ సభను విజయవంతం చేయడానికి ఈ నెల 16వ తేదీ గుంటూరులో వడ్డెర్లతో సభ నిర్వహిస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో వడ్డెర్లకు రాజకీయంగా ఎదిగేందుకు స్థానం కల్పించాలని లేనిచో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.