కర్నూల్

డోన్‌లో భూకబ్జాలను అరికట్టరా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, డిసెంబర్ 15:డోన్ ప్రజలే నా దేవుళ్లు, రాజకీయ భిక్షను ప్రసాదించి ఐదుసార్లు ఎమ్మెల్యేగా తనను గెలిపించిన చరిత్ర డోన్‌కు దక్కిందని వారి రుణమెన్నటికీ మర్చి పోలేనని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రసంగాలు చేయడమే తప్ప డోన్ ప్రజలకు చేసిందేమిటని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో శనివారం బుగ్గన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కేఈపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేఈ రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగన్నరేళ్లు గడిచినా డోన్‌లో ఒక్క ఇంటి పట్టా అయినా పంపిణీ చేశారా అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా వారినే నమ్ముకున్న నారుూ బ్రాహ్మణుల ఇంటి స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించి ప్లాట్లుగా మార్చి కోట్లు గడించారని ఆరోపించారు. అలాగే టైలర్స్ కాలనీలో టైలర్ల స్థలాలను కూడా లక్షలాది రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకున్న ఘనత మీ వర్గీయులకే దక్కిందని మండిపడ్డారు. అంతేగాక చెరువు కాలువలు, వంకల భూములను యథేచ్ఛగా తవ్వేసి ఒక్కో ప్లాటు లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అధికార పార్టీని అడ్డుపెట్టుకుని తెలుగుతమ్ముళ్లు దౌర్జన్యంగా భూములు ఆక్రమించుకుంటున్నా రెవెన్యూ మంత్రిగా ఏమి చేస్తున్నారన్నారు. సాయిబాబా గుడి పక్కన వున్న స్థలాలను కబ్జా చేసి ఒక్కో ప్లాటు రూ. 2.5లక్షల చొప్పున విక్రయిస్తున్నారని ఆరోపించారు. గుడి నిర్మాణానికి కేఈ ప్రతాప్ 50 లక్షల విరాళం ప్రకటిస్తే సంతోషించామని, అయితే గుడి పక్కన స్థలాలు అమ్మి విరాళం ఇచ్చారా అని అనుమానం వ్యక్తం చేశారు. సాయిబాబా గుడి పేరుతో దందాలు చేస్తున్నా, గంగమ్మ మాన్యాన్ని ఆక్రమించుకుని విక్రయిస్తున్నా దేవదాయ శాఖ మంత్రిగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. డోన్ నియోజకవర్గ ప్రజలు మీపై అభిమానంతో ఐదుసార్లు గెలిపిస్తే మీరు చేసిందేమీ లేదని, డోన్‌ను రెవెన్యూ డివిజన్ చేయకుండా పత్తికొండను ఎందుకు చేశారన్నారు. ఇదే మీరు డోన్ ప్రజలపై చూపించిన ప్రేమ అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా మీపై ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, దేవదాయ శాఖల మంత్రిగా వుండి డోన్‌కు చేసిందేమిటో చెప్పాలని సవాల్ విసిరారు. ఇటీవల డోన్‌లో జరిగిన జయహో బీసీ సభలో కేఈ మాట్లాడుతూ బుగ్గనను మాజీ ఎమ్మెల్యేగా చూడటమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం స్థాయిలో మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. గెలుపు ఓటములను నిర్ణయించేది మీరు కాదని, నియోజకవర్గ ప్రజలని గుర్తు చేశారు. డోన్ నియోజక వర్గ ప్రజలకు ఎవరు సేవలందిస్తున్నారో తెలుసని, ఎవరికి పట్టం కట్టాలో వారే నిర్ణయిస్తారని బుగ్గన స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వ విధానాలపై ప్రజలు విసుగు చెందారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.