కర్నూల్

ప్రగతిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 15:అధికారులందరూ ప్రణాళికాబద్దంగా పనిచేసి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యదర్శి రామాంజనేయులు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా 2024 నాటికి సాధించాల్సిన ప్రగతిపై ‘జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్’పై కలెక్టర్ సత్యనారాయణతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కర్నూలు జిల్లా ఏ స్థాయిలో వుంది, 2024 నాటికి ఏమి సాధించాలన్నదే జిల్లా విజన్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. 21 శాఖల్లో 83 పథకాలు అమలవుతున్నాయన్నారు. జిల్లాలో ఏ కేటగిరీ కింద 38 అంశాలు ముందంజలో ఉండగా, బి కేటగిరీలో 13, సీ కేటగిరీలో 5, డీ కేటగిరీలో 23 అంశాలు ఉన్నాయన్నారు. 15 శాఖల్లో గణనీయమైన ప్రగతి సాధించామని, మిగిలిన అన్ని శాఖలు ప్రగతి సాధించేందుకు కృషి చేయాలన్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిస్థితి 71 శాతంతో బి కేటరిరీలో ఉందన్నారు. కడప, అనంపురం, చిత్తూరు జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ వర్షపాతం ఎక్కువ అన్నారు. అయినప్పటికీ తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే పండ్లతోటల పెంపకంపై దృష్టి సారించాలన్నారు. అలాగే వరి స్థానంలో డ్రిప్‌ను ఉపయోగించి పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు సాగుచేస్తే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. వ్యవసాయంతో పాటు పశువులు, కోళ్లు, మేకలు పెంచుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు అన్నారు. గోకులాలను స్వయం సహాయక సంఘం మహిళలు నిర్వహించేటట్లు డీఆర్‌డీఏ శాఖ కృషి చేయాలన్నారు. మత్స్యశాఖ సహాయంతో చేపల పెంపకాన్ని అలవర్చుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తలసరి ఆదాయంలో జిల్లా 10వ స్థానంలో ఉందని, దీనిని పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అలాగే అన్నిశాఖల అధికారులు నిర్ధేశించిన లక్ష్యాల మేరకు పని చేసి చక్కటి ఫలితాలు సాధించాలన్నారు. వైద్య, ఆరోగ్యం, విద్య, పరిశ్రమలు, గృహ నిర్మాణాలు, వాటర్ మేనేజ్‌మెంట్, టూరిజం, తదితర అంశాలపై కలెక్టర్ ప్రసంగించారు.