కర్నూల్

యువత ఆత్మన్యూనతా భావాన్ని వీడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 15:యువత ఆత్మన్యూనతా భావాన్ని విడనాడి సామర్థ్య నైపుణ్యాన్ని పెంచుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని రాయలసీమ రేంజ్ డీఐజీ డి.నాగేంద్రకుమార్ సూచించారు. దినె్నదేవరపాడు సమీపంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రప్రమథంగా పోలీసు శిక్షణ కేంద్రంలో అట్టడుగు వర్గాలకు చెందిన యువతకు పోలీసు ఎంపికకు అవసరమయ్యే శిక్షణ ఇస్తున్నామని, ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్, తదితర కోర్సులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యువత సత్ప్రవర్తనతో ఆత్మన్యూనతా భావాన్ని విడనాడి శిక్షణలో అన్ని అంశాలు తెలుసుకుని భవిష్యత్తులో జరిగే సెలక్షన్స్‌లో రాణించాలన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థకు అప్పగించకుండా జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తే ఫలితాలు అధికంగా వుంటాయన్న ఉద్దేశ్యంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అన్ని సదుపాయాలున్న శిక్షణ కేంద్రంలో అన్ని అంశాల్లో శిక్షణ పొంది యూనిఫాం సర్వీసులో వున్న ఉన్నత పోస్టులకు అర్హులు కావాలన్నారు. నేర్పరితనంతో పైకి ఎదగడంతో పాటు స్వయంప్రతిపత్తిగా జీవించేందుకు రోల్ మోడల్‌గా వుండాలని సూచించారు. ఎస్పీ ఫకీరప్ప, అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఎంపికకు అవసరమయ్యే శారీరక దారుఢ్యం, ఇతర అంశాలపై శిక్షణ పొంది రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లాలన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి భవిష్యత్తులో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలన్నారు.