కర్నూల్

అమ్మో జీ ప్లస్ త్రీ ఇళ్ళు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు రూరల్, డిసెంబర్ 15: జీ ప్లస్ త్రీ ఇళ్లంటే మాకొద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ మంజూరైన ఇళ్లను ఎమ్మిగనూరు ప్రజలు వెనక్కి ఇచ్చే పరిస్థితి నెలకొంది. పేదోడి సొంతింటి కల నెరవేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జీ ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. అందులో లబ్ధిదారులకు రెండు ప్రభుత్వాలు కలిసి 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. మిగిలిన 50 శాతం రుణం రూపంలో లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎమ్మిగనూరుకు 7వేల మంజూరయ్యాయి. ఇందులో సగం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. మొదటి విడతకింద దసరా కానుకగా 3,772 మందికి ఇళ్ల మంజూరైనట్లు సెల్‌కు మెసేజ్‌లు వచ్చాయి. ఇళ్లు మంజూరైన వారిచేత ఈ నెల ఆఖరు లోపు గృహా ప్రవేశం చేయించాలని పాలకులు అధికారులు తెగా ఆరాటపడుతున్నారు. రుణం మంజూరుకు అవసరమైన అన్ని పత్రాలను అధికారులు సిద్ధం చేసి లబ్ధిదారులకు ఇస్తున్నారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు వచ్చాయి. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఇంతవరకు ఇళ్లు బ్యాంకు రుణాలు ద్వారా ఇస్తారని లబ్ధిదారులకు తెలియదు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, ఇళ్లలేని ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకున్నారు. తీరా అధికారుల వద్దకు వస్తే ఇళ్లకు రుణాలు ఇస్తారు, అవి నెలనెల కట్టాలని అనేసరికి జనం తెల్లముఖం వేస్తున్నారు. అప్పు చేసి ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల ఎందుకు తీసుకోవడం, సొంతంగా కట్టించుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి లబ్ధిదారుల్లో నెలకుంది. కొంతమంది మంజూరైన ఇళ్లు మాకు వద్దు అంటూ అధికారులకు లేఖలు ఇస్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తులో అప్పు రూపంగా ఇళ్లు మంజూరు చేస్తామని అందులో పొందుపరచి ఉంది. కాని దీన్ని గమనించకుండా జనం గుడ్డిగా దరఖాస్తు చేసుకున్నారు. అప్పు 20 సంవత్సరాలు కట్టాలి అనే సరికి వెనకంజ వేస్తున్నారు. కాగా ప్రభుత్వం ప్రతి పాదించిన జీ ప్లస్ త్రీ అంటే ఒక బెడ్‌రూం ఉన్న ఇంటికి నెల నెల రూ.2300 ప్రకారం 20 సంవత్సరాలు, డబుల్ బెడ్‌రూం ఉన్న ఇంటికి రూ.2500 ప్రకారం 20 సంవత్సరాలు, త్రిబుల్ బెడ్‌రూం అయితే నెలకు రూ.3300 ప్రకారం 20 సంవత్సరాలు కంతులు కట్టాల్సి వస్తుంది.
పైగా ఒకనెల కంతు కట్టకపోయినా ఇంటిని జప్తు చేస్తామని బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారు. దీంతో కంతులు కట్టకపోతే లాక్కునే ఇళ్లకు అప్పు తీసుకోవడం ఎందుకని ప్రజలు జీప్లస్ త్రీ ఇళ్లు మాకొద్దనుకుంటున్నారు. కాగా అధికారుల మాత్రం దాదాపు 7వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వద్దని వెళ్లే వారిని ఆపమని కొత్త వారికి ఇళ్లను మంజూరు చేస్తామని అంటున్నారు. ప్రభుత్వ మంజూరు చేసే ఇళ్లకు లబ్ధిదారుడి వాటా ప్రకారం చూస్తే ఇళ్లు రూ. 5 లక్షల నుండి రూ.12లక్షల వరకు పడుతాయి. అందువల్లనే జనం జీ ప్లస్ త్రీ ఇళ్ల కోసం మొగ్గు చూపడం లేదు. ఇంత డబ్బు అప్పు చేసి అపార్ట్‌మెంట్‌లో ఉండడం కంటే సొంత స్థలంలో ఇళ్లు కట్టుకుంటే బాగుంటుందని జనం భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వం సొంత ఇంటకి కేవలం రూ.2.50 లక్షలు మాత్రమే ఇస్తోంది. ఇవి ఇళ్లనిర్మాణానికి ఏ మాత్రం సరిపోవడం లేదు. అందువల్ల సొంతఇళ్లు చాలా నిర్మాణం సగంలోనే ఆగి పోయాయి. ఇలా రెండు రకాలుగా ఇబ్బందులు ఉండడం వల్ల పేదోడి సొంత ఇంటికల కలగానే మిలుగుతుందని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీతోనే బీసీల అభ్యున్నతి
* ఎంపీ బుట్టారేణుక
పెద్దకడబూరు, డిసెంబర్ 15: రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమైందని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణుక అన్నారు. శనివారం మండల పరిధిలోని ఓంనగర్ గ్రామంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి అధ్యక్షతన జయహో బీసీ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ స్థాపించిన తర్వాతనే బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత లభించిందన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించినప్పుడు బీసీలు అండగా ఉండి ముందుకు నడిపించారన్నారు. అప్పటినుంచి టీడీపీకి బలం, బలగం బీసీ సామాజిక వర్గాలేనన్నారు. బీసీలు టీడీపీతోనే రాజకీయంగా, ఆర్థికంగా, అన్ని రంగాల్లో రాణించారని తెలిపారు. బిసీలకు టీడీపీ ఇచ్చిన ప్రాధాన్యత ఏ రాజకీయ పార్టీ ఇవ్వదన్నారు. సమాజంలో తమకంటూ ఆత్మగౌరవాన్ని పెంచిన తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ మరువకూడదని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని, బాబుకు బీసీలు అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగే జయహో బీసీ సదస్సుకు వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ ఇన్‌చార్జీ తిక్కారెడ్డి ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు అవినీతి జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు. వేల కోట్లు అవినీతికి పాల్పడిన జగన్‌పై కోర్టులో కేసులు నడుస్తున్నాయని, కేసులను మాఫీ చేసుకోవడానికి బీజేపీతో చేతులు కలిపి రాష్ట్భ్రావృద్ధికి నిరోధకుడుగా ఉన్నారని ఆరోపించారు. ఎన్ని జన్మలెత్తినా జగన్ ముఖ్యమంత్రి కాలేడని, ఆయనకు ముఖ్యమంత్రి పదవి కలయేనని ఎద్దేవా చేశారు. తెలంగానలో టీఆర్‌ఎస్ ఎన్నికలలో విజయం సాధిస్తే వైసీపీ శ్రేణులు ఇక్కడ సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అక్రమాస్తుల కేసులో జగన్ త్వరలో జైలు కెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇసుక దందాలు చేసి కోట్లు సంపాదించారని, ఆయనకు వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ అభివృద్ధికి కోట్ల రూపాయలు విడుదల చేస్తే వాటిపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన ఘనుడు బాలనాగిరెడ్డి అని విమర్శించారు. రైతులకు సాగునీరు విడుదల చేయిస్తే ఎమ్మెల్యే అడ్డుపడ్డారని, అటువంటి ఎమ్మెల్యేకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.