కర్నూల్

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జనవరి 17:రాయలసీమలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, రాయలసీమలో ఉన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు, అధికార పార్టీ, విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల నోటిఫికేషన్ లోపు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి అన్ని పార్టీల నాయకులు, న్యాయవాదులను కోరారు. సీఎం చంద్రబాబు సైతం హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారు కాబట్టి మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత బెంచ్ ఏర్పాటుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారుతుందన్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల ప్రజలు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉన్న హైకోర్టుకు వెళ్ళాలంటే నల్లమల అడవులు దాటి వెళ్ళే పరిస్థితి ఉందన అన్నారు.ప్రస్థుతం రాజధానిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హైకోర్టు కూడా సమీపంలో లేదని అక్కడ సౌకర్యలు లేవని బస చేయడానికి లాడ్జిల కొరత వేదిస్తుందని అన్నారు. ఇప్పటికే తాత్కాలిక హైకోర్టు సీ ఎం వసతి గృహంలో ఏర్పాటు చేశారని న్యావాదులు కూడా సరైన సౌకర్యలు లేవన్నారు. కావున కర్నూలులో ఇప్పటికే మున్సిఫ్ కోర్టు భవనం కొత్తగా నిర్మించారని అందువల్ల వెంటనే తాత్కాలికంగా హైకోర్టు బేంచ్ కర్నూలులో ఏర్పాటు చేయవచ్చని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్‌లోపు హైకోర్టు బేంచకు చర్యలు తీసుకోకపోతే మూలన పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఇందుకోసం విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, సీమలో ఉన్న అన్ని పార్టీల నేతలు ముఖ్యమంత్రిని కలిసి రాబోయే మంత్రి వర్గ సమావేశంలోనే హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడానికి ఆమోదించేలా ఒత్తిడి తేవాలని కోరారు. రాష్ట్ర శాసనసభ కూడా తీర్మానం చేసి కేంద్రానికి, సుప్రీం కోర్టుకు వెంటనే పంపాలని ఆమెరకు సీమలో ఉన్న వారంతా కూడా ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. శ్రీ్భగ్ ఒప్పందం ప్రకారం రాజధాని కోస్తాంధ్రలో ఉంటే హైకోర్టు సీమలో ఉండాలని ఒప్పందం జరిగిందని, ఆ ఒప్పందాన్ని ఎవరు అమలు చేయలేదని కావున కనీసం హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేసి సీమ వాసుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. సమయం మించి పోతే కర్నూలు హైకోర్టు బెంచ్ హామీ నెరవేరదని ఆయన అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.