కర్నూల్

సొంత జిల్లా రెవెన్యూ అధికారుల బదిలీకి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జనవరి 17: రాబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సొంత జిల్లాల్లో పని చేసే రెవెన్యూ అధికారుల బదిలీకి ప్రభుత్వ యంత్రాంగం రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఎన్నికల సంఘం నియమ, నిబంధనల ప్రకారం ఎన్నికల సమయంలో ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఇతర అధికారులు సొంత జిల్లాల్లో పని చేయరాదు. అందువల్ల ఎన్నకల నోటిఫికేషన్ ముందుగానే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలు అధికారులుగా వ్యవహరించే అధికారులను బదిలీకి అన్ని చర్యలు తీసుకుంది. ఆదోని తహశీల్దార్ శ్రీనాథ్ కూడా ఆదోని డివిజన్ హాలహర్వి మండలం నివాసం కావడం వల్ల ఆయనను ఈ వారంలో ఇతర జిల్లాకు బదిలీ చేస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీనాథ్‌తోపాటు జిల్లాలో పని చేస్తున్న ఇతర అధికారులను కూడా బదీలీ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే జిల్లా యంత్రాంగం శాసన సభ, పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో కూడా సిద్దం చేసింది. ఎన్నికల అధికారులను ప్రత్యేకంగా నియమించి ఓటర్ల జాబితా తప్పులు,తీసివేతలు చేర్పులు, మార్పులు కూడా చేయడం కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏ ఏ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్ల ఉన్నారని కూడా ఓటర్ల జాబితాలను సిద్దం చేసింది. అంతేకాకుండాకేంద్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనాలను అమలు చేయడానికి ముందుగానే అన్ని చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లాకు చెందిన స్వంత జిల్లా అధికారులను, ఇతర జిల్లాలకు ఈ వారంలో బదిలీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్నికల నోటీఫికేషన్ వెలువడితో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే సొంత జిల్లా అధికారులను బదిలీ చేస్తున్నారు.
చంద్రబాబును గద్దె దింపండి
* పీఏసీ చైర్మన్ బుగ్గన పిలుపు
డోన్, జనవరి 17:రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును గద్దె దింపాలని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘రావాలి జగన్-కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే బుగ్గన మండల పరిధిలోని చనుగొండ్ల గ్రామంలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ నేత వెంకోబరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో గత నాలున్నరేళ్లుగా దుర్మార్గపు పాలన కొనసాగుతోందని ఆరోపించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి వేలాది ఎకరాల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ హాయాంలోనే 85 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని, వాటికి మెరుగులు దిద్ది తాను చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జలయజ్ఞం పేరుతో వైఎస్ కాలువల తవ్వకాలు చేపడితే చంద్రబాబు లస్కర్ పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేగాక వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని చేపడితే బాబు ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. నాలున్నరేళ్ల పాటు ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో వైసీపీ అధినేత జగన్మో ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాన్ని కాపీ కొడుతున్నారని ఆరోపించారు. అంతేగాక డోన్ నియోజకవర్గ ప్రజలు మీపై అభిమానంతో ఐదుసార్లు గెలిపిస్తే మీరు చేసిందేమీ లేదని, డోన్‌ను రెవెన్యూ డివిజన్ చేయకుండా పత్తికొండను ఎందుకు చేశారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని ప్రశ్నించారు. డోన్ నియోజకవర్గ ప్రజలకు ఎవరు సేవలందిస్తున్నారో, ఎవరు దోచుకుంటున్నారో బాగా తెలుసని, రాబోయే ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టాలో వారే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వ విధానాలపై ప్రజలు విసుగు చెందారని రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.