కర్నూల్

అసెంబ్లీ సీటు నాకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జనవరి 17:రాబోయే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటు తనకే వస్తుందని, కొందరు వ్యక్తులు అసత్య ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాలలో ఉన్న కమ్యూనిటీ హాలులో గురువారం 33 వార్డులకు చెందిన బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎస్వీ మాట్లాడుతూ వార్డులోని ప్రజలతో మమేకమై వారి అవసరాలు, సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశలో బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత బూత్ కన్వీనర్లపై ఉందన్నారు. అయితే నగరంలో కొందరు వ్యక్తులు తమకే సీటు వస్తుందని అసత్య ప్రచారం చేస్తూ అపోహలు సృష్టిస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని, అలాంటి వారు చెప్పే మాటలు నమ్మవద్దన్నారు. ఖచ్చితంగా అసెంబ్లీ సీటు తనకే వస్తుందని కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలే టీడీపీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం అమలు చేస్తున్న చంద్రన్న యువనేస్తం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల మొత్తాన్ని సంక్రాంతి కానుకగా రెట్టింపు చేశారన్నారు. వీటికి తోడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ ఆయా వార్డుల్లోని బూత్ కన్వీనర్లు, నాయకులు ప్రజలకు సక్రమంగా చేర్చి పార్టీ పట్ల నమ్మకం పెంచి 2019 ఎన్నికల్లో కర్నూలు శాసనసభ సీటును సీఎం చంద్రబాబుకి కానుకగా ఇవ్వాలన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతవరకైనా, ఎంతటి త్యాగానికైనా వెనుకాడేది లేదని, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు తన వెంట నడిచి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలన్నారు. కావున బూత్ స్థాయి కన్వీనర్లు వారికి అప్పజెప్పిన బాధ్యతను విధిగా నిర్వర్తించి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.