కర్నూల్

కేసీఆర్‌తో జతకడితే జగన్‌కు రాజకీయ సమాధే.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, జనవరి 22:ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జతకట్టిన వైసీపీ అధినేత జగన్‌కు ఈ ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదని కాంగ్రెస్‌పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి జోస్యం చెప్పాడు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే పులివెందుల నుంచైనా, కుప్పం నుంచైనా పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. బైరెడ్డి మంగళవారం పట్టణంలోని తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ అధికారమే పరమాధిగా భావించి జగన్ కేసీఆర్‌తో చేతులు కలిసి ఘోర తప్పిదం చేశాడన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటే ఒప్పుకునేది లేదని బహిరంగంగా ప్రకటించిన కేసీఆర్‌ను జగన్ ఎలా సమర్థిస్తాడని ప్రశ్నించారు. రాజకీయ అనుభవం లేని జగన్ ఆంధ్రుల అభిమానాన్ని తాకట్టు పెట్టడం భావ్యం కాదన్నారు. సత్తా ఉంటే పోటీ చేసి గెలవాలి కానీ, ఆంధ్రులను అవమానపరచిన వారి మద్దతు కూడగట్టుకోవడం వైసీపీ రాజకీయ అనుభవలేమిని ఎత్తిచూపుతుందన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు ఇంతకాలం ప్రధాని మోదీ వెంట తిరిగి ఇప్పుడు ఎన్నికల కోసం బీజేపీని విమర్శించడం విడ్డూరంగా వుందన్నారు. ఇంతకాలం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కేవలం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయంలో సంక్షేమ ఫలాలు అందిస్తామని రోజుకో పథకం ప్రవేశపెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, డబ్బు పెట్టెలతో చేసే రాజకీయం ఎక్కువ కాలం నిలవదన్నారు. ఈనెల 28వ తేదీ నంద్యాలలో కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నామని, రాష్ట్ర నాయకులు హాజరవుతారని కావున కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కాగా నంద్యాల ఎంపీ స్థానానికి పోటీ చేయాలని కార్యకర్తలు ఈ సందర్భంగా బైరెడ్డిని కోరారు.