కర్నూల్

హిమాలయ గురూజీ సేవలు అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 22:పేద ప్రజల కోసం నింతరం సేవలు అందిస్తున్న హిమాలయ గురూజీ సేవలు అమోఘమని వైద్య శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కొనాయాడారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన ఉచిత భోజన వితరణ కేంద్రాన్ని మంగళవారం మంత్రి ఫరూక్ శాంతి ఆశ్రమ ట్రస్టు వ్యవస్థాపకులు హిమాలయ గురూజీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలు జిల్లాతో పాటు తెలంగాణలోని అలంపూర్, మానవపాడు జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించిన ఘనత గురూజీకి దక్కిందన్నారు. ఇవేకాకుండా వృద్ధాశ్రమాలు, అంగన్‌వాడీ సెంటర్లలో చిన్నారులకు భోజనం అందజేయడం హర్షణీయమన్నారు. హిమాలయ గురూజీ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తుందన్నారు. గురూజీ పేదల కోసం చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం
* మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి
చాగలమర్రి, జనవరి 22: రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఉండడం మన రాష్ట్ర ప్రజల అదృష్టమని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి కొనియాడారు. మంగళవారం చాగలమర్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న సింగిల్‌విండో మాజీ అధ్యక్షులు నారపురెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టర్ షాబుల్ మొహిద్దీన్ స్వగృహంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బాగా కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలువడం అసాధ్యమన్నారు. అభివృద్ధితోనే సీఎం చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తారన్నారు. రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయుటకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను తెలుగుదేశం పార్టీ తరపున నంద్యాల ఎంపీ స్థానానికి పోటీ చేయుటకు సిద్ధంగా ఉన్నానని గంగుల ప్రకటించారు. ప్రజలు కూడా ఆశీర్వదించాలని కోరారు. తాను నంద్యాల ఎంపీగా ఉన్నప్పుడు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని తెలిపారు. రైల్వే బ్రాడ్‌గేజ్, జాతీయరహదారి విస్తరణ, ఎలక్ట్రిక్ గ్రేడ్ సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పనులు చేపట్టుటకు కృషి చేశానని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో ఖనిజ సంపద ఎక్కువగా ఉందని ఇతర ప్రాంతాలకు ఈ ఖనిజ సంపద వెళ్లకుండ ఇక్కడే పరిశ్రమలు స్థాపించాల్సి ఉందన్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తికాకపోయినా టోల్‌గేటు వసూలు చేయడం తగదని, ఈ నెల 28లోపు టోల్‌గేటు ఆపివేయకుంటే తమ కార్యకర్తలు ఆందోళనలకు దిగుతారని ఆయన హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తాను ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.