కర్నూల్

ఒకరి తరువాత ఒకరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 1: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డికి అభిమానుల నుంచి మద్దతు పెరుగుతోంది. గత రెండు రోజులుగా కర్నూలులో ఉన్న ఆయన మండలాల వారీగా తన అభిమానులతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌కు దూరం కావడానికి కారణాలు మరో పార్టీలో చేరాలనుకుంటున్న అభిప్రాయాన్ని వారితో పంచుకుంటున్నారు. ఆయనతో మూడు, నాలుగు నియోజకవర్గాల్లోని అభిమానులు, సన్నిహితులు, నాయకులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు కోట్ల తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరి కొందరు వైకాపాలో చేరితే భాగుంటుందని సూచించినట్లు కూడా తెలుస్తోంది. ఈ అంశంపై వారికి వివరణ ఇచ్చి తనకు తోడుగా ఉండాలని కోరినట్లు చర్చించుకుంటున్నారు. గతంలో కోట్ల వెంట నడిచి 2014 ఎన్నికల తరువాత ఇతర పార్టీల్లో చేరిన వారు సైతం ఆయనతో చర్చించేందుకు రావడంతో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆనందంతో ఉన్నట్లు సన్నిహితులు పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో ఇతర పార్టీల్లోకి వెళ్లినా తనపై ఇంకా వారికి నమ్మకం ఉండడం సంతోషించాల్సిన అంశమని పేర్కొన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కోసం తాను పడ్డ శ్రమ కేవలం రాష్ట్ర నాయకుల కారణంగా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని, ఇప్పటికీ ఢిల్లీ పెద్దలు వారి మాటే వినడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని సన్నిహితుల వద్ద కోట్ల వాపోయినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేమని తేల్చిచెప్పి తనకు అండగా ఉండాలని అభిమానులను కోరుతున్నట్లు తెలుస్తోంది. తన స్థాయికి తగిన గౌరవం వైకాపాలో కూడా దక్కకపోవచ్చని అన్ని విధాలా అండగా ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని, అందులో భాగంగా తాను కోరిన వెంటనే వేదావతి ఎత్తిపోతల పథకానికి రూ.1900కోట్లను మంజూరు చేస్తూ జీఓ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారని సన్నిహితులు పేర్కొంటున్నారు. త్వరలోనే తుంగభద్ర దిగువ కాలువకు జలాశయం నుంచి భూగర్భ పైపు లైను పనులు మంజూరు చేస్తారన్న విశ్వాసాన్ని కోట్ల తన అభిమానులతో అన్నట్లు సమాచారం. ఇదే జరిగితే కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో కరువు ఛాయలు దూరమవుతాయని వెల్లడించినట్లు తెలిసింది. వేదవతి, దిగువ కాలువ భూగర్భ పైపులైను పనులు, గుండ్రేవుల జలాశయం నిర్మాణం పూర్తయ్యే వరకు తాను విశ్రమించబోనని హామీ ఇచ్చారని సమాచారం. ఈ మూడు ప్రాజెక్టులను రానున్న అయిదేళ్ల కాలంలో పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని గట్టిగా చెబుతున్నారని వెల్లడవుతోంది. కోట్లతో చర్చలు జరిపిన వారు అత్యధికులు కాంగ్రెస్‌కు దూరం కావడం మంచి నిర్ణయమేనని పేర్కొన్నట్లు తెలిసింది. కొత్త ప్రాజెక్టుల విషయంలో పట్టుదలతో పని చేయాలని కోరినట్లు సమాచారం. గత రెండు రోజులుగా కర్నూలులోని కోట్ల స్వగృహం నాయకులు, సన్నిహితులు, అభిమానులతో కిటకిటలాడుతోంది. కోట్ల కుటుంబం పార్టీ మారుతుందన్న వార్తల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌ల
అనుసంధానంలో పటిష్ట జాగ్రత్తలు
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు, ఫిబ్రవరి 1: ఇవియంలు, వివిప్యాడ్‌ల అనుసంధానలో పటిష్ట జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర శివారు ప్రాంతంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలో భద్రపరచిన వీవీ ప్యాడ్‌లకు ఈవీఎంలను అనుసంధానం చేసే విధాన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలసి సమీక్షించారు. బీజేపీ ప్రతినిధి నాగేంద్రకుమార్, వైకాపా ప్రతినిధి శ్రీనివాసులురెడ్డి, బీఎస్పీ ప్రతినిధి వౌలాలి, డిఆర్వో వెంకటేశం తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. రానున్న సాధరణ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలను వీవీప్యాడ్‌లకు అనుసంధానం చేసే ప్రక్రియను జాగ్రత్తంగా చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో వినియోగించాల్సిన ఈవీఎంలలో వీవీప్యాడ్‌లను అనుసంధానం చేసి బెల్ ఇంజినీర్లతో మొదటి ధపా పరిశీలన చేయించి ఓటు వేసే విధానాన్ని, యంత్రంలో చిఫ్ అమర్చే విధానాన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎం, వీవీప్యాడ్‌లలో రాకీయపార్టీల ప్రతినిధులకు వున్న సందేహాలను బెల్ ఇంజనీర్లు నివృత్తి చేశారు. ఈవీఎంలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.

రోడ్డు విస్తరణ బాధితులకు నష్టపరిహారం పంపిణీ
* ఎమ్మెల్యే బ్రహ్మా
నంద్యాల, ఫిబ్రవరి 1: పట్టణంలో ఉప ఎన్నిక సందర్భంగా గాంధీ చౌకు నుండి సాయిబాబానగర్ వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టాలని అందులో భాగంగా గాంధీ చౌకు నుండి పద్మావతినగర్ వరకు 60 అడుగుల రోడ్లు విస్తరించారని, అ విభాగంలో బాదితులందరికీ నష్టపరిహారం చెల్లించినట్లు ఎమ్మెల్యే భూమాబ్రహ్మానందరెడ్డి తెలిపారు. పద్మావతి నగర్ నుండి సాయిబాబా నగర్ వరకు ఉన్న రోడ్డు విస్తరణ బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లితుందని, అప్పుడే ముఖ్యమంత్రి సమానంగా నష్టపరిహారం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పద్మావతి నుండి సాయిబాబా నగర్ వరకు రోడ్డు విస్తరణలో గృహాలు, దుకాణాలు పోగొట్టుకున్న బాదితులకు 60 అడుగుల విస్తరణతో సమానంగా నష్టపరిహారం పంపిణీ చేసేందుకు జనవరి నెల 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో క్యాబినేట్ ఆమోదం లభించిందని దీంతో రావాల్సిన రూ.53 కోట్లతోపాటు మరో రూ.24 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సమ్మతించిందని, త్వరలో నష్టపరిహారం సొమ్ము జమ అవుతుందని, బాధితులందరికి నష్టపరిహారం ఇస్తారన్నారు. దుకాణాలు కోల్పోయిన వారు 73 మంది వారికి మున్సిపల్ దుకాణాలు కేటాయిస్తుందని, శనివారం (నేడు) బొమ్మలసత్రంలో నిర్మించిన ఉపరితల వంతెనను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫరూక్, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, ఎంపీ ఎస్పీవైరెడ్డితోపాటు తాను కలసి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈవంతెనను ప్లస్ ఆకారంలో నిర్మించుటకు అనుమతులు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే నూనెపల్లె వద్ద అండర్‌వే వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చితే నిర్మించేందుకు రైల్వే శాఖ అనుమతించినట్లు తాను గుంటూరు డీఆర్‌ఎంతో ఈ విషయంపై చర్చించడం, సానుకూల నిర్ణయం తెలుపుడంతో మరికొద్ది రోజుల్లో అండర్‌వే వంతెన పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. పాత్రికేయులకు నంద్యాలలోని ఎస్‌ఆర్‌బీసీ, నందమూరి ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూము గృహాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సమ్మతించిందని, సుముఖంగా ఉన్న పాత్రికేయులు ఈ మేరకు దరఖాస్తులు చేసుకుంటే వెంటనే కేటాయిస్తామన్నారు. అలాగే ఈనెల 2,3,4 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 12 రకాల సామాజిక పెన్షన్లు ఎన్‌టీఆర్ భరోసా కింద లబ్ధిదారులకు భోజన సౌకర్యం కల్పించి పంపిణీ చేస్తారని, ఇదొక ఉత్సవంగా నిర్వహించి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.
అకాల వర్షంతో పంట నష్టంపై స్పందించిన సీఎం
జిల్లా రైతాంగానికి సాయం అందిస్తాం
* మంత్రి అఖిలప్రియ
ఆగళ్లడ్డ, ఫిబ్రవరి 1: అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో నష్టపరిహారం అందిచేందుకు ఆయన హామీ ఇచ్చారని, నష్టపరిహారం వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఫోన్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతన్నల సమస్యలను మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. జిల్లాలో వర్షాలు సక్రమంగా కురవని కారణంగా ఖరీప్ పంటలు అంతంత మాత్రమే వున్నాయని, అయితే అవి కోతకు వచ్చే సమయంలో అకాల వర్షం కురవడంతో పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయన్నారు. దీంతో రైతులు ఆందోళణ చెందుతున్నారన్నారు. నియోజకవర్గంలోని ఆళ్లగడ్డ, బత్తలూరు, నల్లగట్ల, గూబగుండం, చాగలమర్రి, రుద్రవరం, ఇంజేడు, గోస్పాడు, తదితర గ్రామాల్లో పర్యటించి రైతన్నలతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నామన్నారు. వరి, మిరప, జొన్న, నువ్వులు, పత్తి, తదితర పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో వున్నారని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వివరించారన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు పడుతున్న కష్టాలను ముఖ్యమంత్రికి వివరించడంతో ముఖ్యమంత్రి జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. అందుకు సంబంధించి జిల్లాలో ఏ మేరకు పంట నష్టపోయారో అంచనా వేసి పంపాలని అధికారులను ఆదేశించారన్నారు.

కేంద్ర బడ్జెట్ ప్రతిపక్షలకు చెంప పెట్టు
ఆదోని, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రతి పక్షలకు చెంప పెట్టు అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ అన్నారు. కేంద్ర బడ్జెట్ జనరంజకమైన బడ్జెట్ అని అన్నారు. శుక్రవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఏప్రభుత్వం కూడా రైతులను పట్టించుకోలేదని కాని బీజేపీ ప్రభుత్వం ఐదు ఎకరాల్లోపు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.6వేలు ఇస్తున్నట్లు ప్రకటించి రైతులకు ఎంతో మేలు చేసిందని అన్నారు. పంటనష్ట పరిహారం కింద బ్యాంకు వడ్డీలో ఐదు శాతం మినహాయింపు ఇచ్చారన్నారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు రూ.3వేలు పెన్షన్ ఇస్తున్నట్లు ప్రకటించడం వల్ల కార్మికులకు ఎంతో మేలు జరిగిందన్నారు. కార్మికుల పెన్షన్ వల్ల దేశంలో 10కోట్ల మంది కార్మికులకు లబ్ధి పొందుతారన్నా. అంగన్‌వాడీ ఉద్యోగులకు 50శాతం వేతనాలు పెంచిందన్నారు.

బాబు మాటలకు మరోసారి
మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు
* ఎమ్మెల్యే బుగ్గ రీజేంద్రనాథ్ రెడ్డి
బేతంచెర్ల, ఫిబ్రవరి 1: గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలుచేయపోగా మరో మారు మోసం చేసేందుకు ఇప్పుడు ఎన్నికల ముందు ఇస్తున్న హామీలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు చంద్రబాబూ అంటూ డోన్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గరాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పునాది వేసిన ఘనత దివంగనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కిందన్నారు. ప్రతి కుటుంబం ఉన్నతంగా ఎదిగేందుకు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, పక్కాగృహాలు, పించన్ల పెంపు, ఆరోగ్యశ్రీ అమలు చేసిన ఏకైక నేత వైఎస్సార్ అన్నారు.

విభజన హామీలు అమలు చేయాలి
* టీడీజీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి
కల్లూరు, ఫిబ్రవరి 1: రాష్ట్ర విభజన నేపత్యంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదాకల్పించి బిల్లు ప్రవేశపెట్టాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సొమిశెట్టి వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై టీడీపీ ఆధ్వర్యంలో మోటార్‌బైకులతో నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరయాదవ్, జిల్లా ప్రతినిధి మల్లికార్జునరెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన సందర్భంగా అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బాద్యత వహించి నిధులు కేటాయించాలన్నారు. 2014 ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చి పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి తర్వాత రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించి మోసం చేసి ఆంధ్ర ప్రజల జీవితాలతో చెలగాటకం ఆడుతుందని మండిపడ్డారు. కొంత మంది అవినీతి పరులను లోపాయకార ఒప్పందం చేసుకొని రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మెండిచేయి చూపుతూ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థవంతుడు కాబట్టి రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా అన్నివిధాలుగా చూస్తున్నారన్నారు. ఇప్పటికైన కేంద్రం స్పందించి రాష్ట్రానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేసి పార్లమెంట్‌లో ప్రత్యేకహోదా బిల్లు ప్రవేశపెట్టి ఇచ్చిన మాటలు నిలుపుకోవాలన్నారు. లేని పక్షంలో రాభోయే రోజులలో జరిగే పరిణామాలకు కేంద్రం పూర్తి బాద్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
* డీసీసీ అధ్యక్షులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి
డోన్, ఫిబ్రవరి 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, హోదా వచ్చేంత వరకు పోరాడాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి స్పష్టం చేశారు. హోదా కోసం శుక్రవారం జరిగిన బంద్‌కు మద్దతు పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టాలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. హోదా కోసం ఒక్కో పార్టీ ఒక్కో సారి పోరాటాలు చేయకుండా కలిసి కట్టుగా అన్ని రాజకీయ పార్టీల ఏకమై కేంద్రంపై పోరాడాల్సిన అవసరం ఎంతైన వుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాద్యమవుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి రాగానే హోదా పైనే తొలి సంతకం చేయనున్నారని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల దంపతులకు మద్దతుగా ఉద్వేగంతో కొంత మంది యువకులు యువజన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని, వాటిని ఆమోదించలేదని డీసీసీ అధ్యక్షులు స్పష్టం చేశారు.

వవసాయ కళాశాల వద్ద ఎలుగుబంటి హల్‌చల్
మహానంది, ఫిబ్రవరి 1: మహానంది సమీపంలోని వ్యవసాయ కళాశాల వద్ద ఎలుగుబంటి సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఆరు నెలల క్రితం ఓమారు ఎలుగుబంటి సంచరిస్తుండడంతో అటవీ శాఖ అధికారులు కొన్ని చర్యలు తీసుకొని రోడ్డు వెంట గుంతలు తీయించారు. వన్యప్రాణులు ఊరిలోకి రాకుండ పది అడుగుల లోతు గుంతను తీయించారు. అయితే గత 20 రోజులుగా వ్యవసాయ కళాశాల సమీపంలోని పాలేరు వాగు కాల్వ వెంట రాత్రి సమయాల్లో సంచరిస్తున్నట్లు కళాశాల ఉద్యోగులు, కూలీలు తెలుపుతున్నారు. పొలాలకు వెళ్తున్న సమయంలో దాని అరుపులతో భయభ్రాంతులకు గురవుతున్నామని అటవీ అధికారులకు కూడా సమాచారం అందించినా ఎలంటి చర్యలు తీసుకోవడం లేదని వారు వాపోతున్నారు. పాలేరు వాగు సమీపంలోనే విద్యార్థుల హాస్టల్‌లు కూడా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలుగుబంటి బారి నుండి కాపాడాలని వారు కోరుతున్నారు.

6న టీడీపీ కార్యాలయం ప్రారంభం
* రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి
నంద్యాల, ఫిబ్రవరి 1: నంద్యాలలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 6వ తేదీన పద్మావతినగర్ ఆర్చ్‌కు ఎదురుగా జయంతి వెజ్‌వరల్డ్‌లో ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఒక ప్రైవేటె హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో పట్టణంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని, ఈ కార్యాలయం ద్వారా పట్టణంలోని 42 మున్సిపల్ వార్డులు, గోస్పాడు, నంద్యాల మండలం కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. టీడీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ లేదా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అసెంబ్లీ సీటు రేసులో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. టీడీపీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి విజయానికి తమ సంపూర్ణ మద్దతు ఉండడంతో పాటు ఘన విజయం సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని, టీడీపీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయేందుకే తాను పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తానన్నారు.

చంద్రబాబు హామీల
నెరవేర్చడంలో విఫలం
* బీజేపీ జిల్లా అధ్యక్షులు హరీష్‌బాబు
మంత్రాలయం, ఫిబ్రవరి 1: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో విఫలమయ్యారని బీజేపీ జిల్లా అధ్యక్షులు హరీష్‌బాబు విమర్శింవచారు. శుక్రవారం మంత్రాలయంలో ఓ ప్రైవేట్ వసతి గృహం ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 16,17తేదీల్లో బీహార్ రాష్ట్రం, పాట్నాలో ఏర్పాటు చేయునున్న ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమ్మేళన కార్యక్రమానికి జిల్లానుంచి 50మంది బీజేపీ నాయకులు బయలుదేరుతున్నారని తెలిపారు. అలాగే ఆనెల చివరలో మంత్రాలయంలో బీసీల అభివృద్ధిపై భారీ సదస్సు నిర్వహిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం నాలుగుసంవత్సరాల 9నెలలు టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన 600 హామీల్లో 40, 50 హామీలు మాత్రమే చేసి మిగితా వదిలేశారన్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో చంద్రబాబు ఊసరవళ్ళి రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.

మహానందీశ్వరుని సన్నిధిలో
దివ్యదర్శనం భక్తులు
మహానంది, ఫిబ్రవరి 1: మహానందిలో దివ్యదర్శన భక్తులు పూజలు నిర్వహించారు. శుక్రవారం అనంతపురం జిల్లా పుదిగుబ్బ మండలానికి చెందిన దాదాపు 200 మంది భక్తులు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ మర్యాదలతో ఇన్‌స్పెక్టర్లు సుబ్బారెడ్డి, శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలోని పుష్కరిణిలలోపుణ్య స్నానాలు ఆచరించి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.

ప్రజాసంక్షేమమే టీడీపీ ద్యేయం
* ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి
కల్లూరు, ఫిబ్రవరి 1: ప్రజాసంక్షేమమే ద్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం 10వ వార్డులో ఏర్పాటు చేసిన థ్యాంకు సీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కోశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వితంతు, వికలాంగు, వద్ధాప్య, కల్లుగీత, చేనేత మొదలగు పెన్షన్ దారులకు పెన్షన్‌ను రెట్టింపు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు పేదలకు ఎంతో మేలు చేస్తున్నారన్నారు. ప్రతి పేదవాడు ధైర్యంగా బతికేందుకు తమ కుటుంబంలో ఒక పెద్ద కొడుకులా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారన్నారు. ఆయన చేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలు పొంది రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని ఆయన ప్రజలను కోరారు.

రాష్ట్రంలో ఒక్క రైతు కూడా
ఆత్మహత్య చేసుకోలేదా!
* ఎమ్మెల్యే ఐజయ్య
మిడుతూరు, ఫిబ్రవరి 1: రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో వర్షాలు కురియక, పంటలు పండక చేసిన అప్పులు తీర్చలేక రోజుకో రైతు ఆత్మహత్య చేసుకుంటుండగా, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పేర్కొనడం విడ్డూరంగా వుందని, కేవలం సీఎం చంద్రబాబునాయుడు రాసి ఇచ్చిన లెటర్‌ను గవర్నర్ చదివి విన్పించారని ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. శుక్రవారం నందికొట్కూరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకుల్లో రుణాలు మాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తెస్తుండడంతో అధిక వడ్డీలకు రైతులు బయట అప్పులు తెచ్చి బ్యాంకుల్లో కడుతున్నారని, వర్షాలు లేక పంటలు చేతికి రాకపోవడంతో రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. జలాశయాల్లో ఎక్కడ చూసినా నీరు అడుగంటిపోవడంతో తాగేందుకే నీరు లేకుంటే ఈ సంవత్సరం వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సాధించిందని గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం ఎంతవరకు సబబో తెదేపా నాయకులే చెప్పాలన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి లెక్కలు చెప్పమంటే సీఎం చంద్రబాబునాయుడు చెప్పకుండా ప్రత్యేక హోదా పేరుతో సమస్యను పక్కదారి పట్టిస్తున్న విషయం గవర్నర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణంలో అంచనాలు పెంచి భారీ అవినీతి చోటు చేసుకున్న విషయాన్ని కూడా గవర్నర్ పట్టించుకోకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లేఖను చదివి తన పని పూర్తి అయ్యిందని అన్పించుకోవడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు.